అస్సలు వదలేడం లేదుగా.. వరల్డ్ కప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికా ఓడినా జగన్‌పైనే ట్రోలింగ్.. మరి దారుణంగా..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ అధినేత జగన్‌ తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ విజయంపై నమ్మకంతో ఎన్నికల బరిలో నిలిచిన జగన్‌కు..

ఎన్నికల ఫలితాలు మాత్రం ఊహించని షాక్‌ ఇచ్చాయి. 2019లో రికార్డు స్థాయిలో 151 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. మరోవైపు కూటమి మాత్రం 164 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లలో విజయం సాధించి.. 100 శాతం స్ట్రైక్ రేటును సాధించింది. అప్పటి నుంచి వైఎస్‌ జగన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతుంది.

జనసేనకు వచ్చిన సీట్లకు కూడా వైసీపీకి రాలేదని, ఆడుదాం ఆంధ్ర అని జగన్ క్రికెట్ టీమ్ తయారుచేసుకున్నాడని.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీవీ షోలలో సైతం వైసీపీని, లక్ష్యంగా చేసుకుని పంచు డైలాగ్‌లు పేలుతున్నాయి. అది కూడా ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి సపోర్టు చేసిన కమెడియన్ రియాజ్ ముందే కావడం.. అతడు కూడా ఆ కామెంట్స్‌ను ఫన్నీ వేలోనే ట్రీట్ చేస్తున్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీలో.. రియాజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందని చెప్పగానే, ఆది.. ఎన్ని 11 మార్కులు మార్కులు వచ్చాయా? అని తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షోలో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది.. రియాజ్ మెన్న ఎగ్జామ్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని అడిగితే.. దానికి 175కి 10 వచ్చాయని యాదమ రాజు చెప్పారు. అదే ప్రోగ్రామ్‌లో.. సుధీర్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటామని ఎప్పుడైనా అనిపించిందా? అని రియాజ్‌ను అడుగగా.. 4వ తేదీ (ఎన్నికల ఫలితాల తేదీ) తర్వాత అనుకున్నానని అతడు చెబుతాడు. అలాగే.. తాను ఎవరికి సపోర్టు చేయాలని రియాజ్ అడగగా.. వాడు ఎవరికి సపోర్టు చేసిన అది ఓడిపోతుందని యాదమ రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, జబర్దస్త్‌లో ఓ స్కిట్‌లో ఉండనీలెమ్మా.. ఉండనీలెమ్మా అని జగన్‌ను ఇమిటేట్ చేసేలా రియాజ్ చేయడం కూడా జరిగింది.

ఇదిలాఉంటే, తాజాగా టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ఫర్ ఏ రిజన్ ( Jagan For a Reason) అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని.. ఏపీలో జగన్ కూడా మూడు రాజధానులు ప్లాన్ చేశారని, సౌతాఫ్రికా పేరు ఇంగ్లీష్‌లో మొత్తం 11 లెటర్లు ఉంటాయని, వైసీపీకి కూడా 11 సీట్లు వచ్చాయని.. ”జగన్ ఫర్ ఏ రిజన్” అని కామెంట్స్ చేస్తున్నారు.