Cabbage : క్యాబేజీ వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు. ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే.!
Cabbage : మన రోజువారి ఆహారంలో కచ్చితంగా ఆకుకూరలు మరియు కూరగాయలు ఉండాలి అని ఆరోగ్య నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. విటితో మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
అయితే అన్ని కూరగాయలతో పాటుగా క్యాబేజీ కూడా కచ్చితంగా తినమని చెబుతూ ఉన్నారు. కానీ చాలామంది దీనిని తినటానికి అస్సలు ఇష్టపడరు. అయితే క్యాబేజీలో ఉండే పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకనుంచి తినకుండా అసలు ఉండలేరు. క్యాబేజీ రోగనిరోధక శక్తి ని పెంచే గుణం ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే షుగర్, థైరాయిడ్ సమస్యలపై క్యాబేజీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ఈ క్యాబేజీ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్యాబేజీలో నీరు అనేది ఎక్కువ శాతం ఉంటుంది.దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది మనకు రోజంతటికి కావలసిన హైడ్రేట్ ను ఇస్తుంది. అయితే బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారికి కూడా ఇది చాలా మంచిది. దీని పచ్చిగా సలాడ్,సూప్ లాంటివి కూడా చేసుకొని తీసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉన్నాయి. అంతేకా క క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే,సి కూడా ఉన్నాయి. ఇది జీ ర్ణ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది ఎంతో ప్రాణాంతకమైన గుండె కాన్సర్ సమస్యల నుండి కూడా ఇది ఎంతగానో రక్షిస్తుంది…
Cabbage మధుమేహం
ఈ క్యాబేజీలో యాంటీ హైపర్ గ్లైసోమిక్ గుణం అనేది ఉంటుంది. ఇది మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది డయాబెటిస్ నెఫ్రోపతి నుండి కూడా ఎంతగానో రక్షిస్తుంది. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా నిర్వహించి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.అలాగే షుగర్ ఉన్నటువంటి వారు కచ్చితంగా వారి డైట్ లో క్యాబేజీని చేర్చుకుంటే చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు…
Cabbage క్యాన్సర్
క్యాబేజీలో గ్లూకో సైనోలేట్స్ మరియు సల్ఫర్ ఉంటుంది. అంతేకాక క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్ల మెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ ను తగ్గిస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు కూడా అభివృద్ధి చెందకుండా కూడా రక్షిస్తుంది. క్యాబేజీ అన్నీ సీజన్లో కూడా మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది…
జీర్ణక్రియ : దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాబేజీ చెడు కొలెస్ట్రాలను తగ్గించి, అలాగే మంచి కొలెస్ట్రాలను పెంచగలదు. ఇది కడుపు అల్సర్ రాకుండా కూడా చేస్తుంది. ఈ క్యాబేజీని డైట్ లో చేర్చుకోవటం వలన మన శరీర పనితిరు కూడా ఎంతో మెరుగుపడుతుంది.అయితే ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు ఉండి కూడా దూరంగా ఉండవచ్చు. శరీరంలో మంట,వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెట్టుతుంది. దీంతో క్యాన్సర్, గుండె సమస్యలు డయాబెటిస్ అల్జీమర్స్ తో బాధపడే వారికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
Cabbage : క్యాబేజీ వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!
గుండె ఆరోగ్యం : క్యాబేజీలు ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించటంతో పాటు బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు ఒక వరం అని చెప్పొచ్చు…