Dondakaya Ulli karam:నోటికి కారం కారంగా రుచిగా ఉండే దొండకాయ ఉల్లి కారం ఇలా చేసి చూడండి..దొండకాయ ఉల్లి కారం..కొన్ని కూరలు ఆరోగ్యకరమైనప్పటికీ అయిష్టంగా తింటారు,లేదా పక్కన పెట్టేస్తుంటారు.
ముఖ్యంగా దొండకాయ అనగానే పెదవి విరుస్తారు.కాని దొండకాయకు ఉల్లికారం తగిలించి వండవల్సిన పద్ధతిలో చేస్తే,ముద్ద కూడా వదలకుండా తినేస్తారు.
కావాల్సిన పదార్థాలు
దొండకాయలు – ¼ KG
ఆయిల్ – 3 నుంచి 4 స్పూన్స్
తాలింపు గింజలు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 3
కరివేపాకు – 1 రెమ్మ
ఉప్పు – తగినంత
ఉల్లిపాయలు – 2
కారం – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -10
ధనియాల పొడి – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.దొండకాయలను శుభ్రంగా కడుక్కుని, రెండు వైపులా కొనలు కట్ చేసుకోవాలి.
2. దొండకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఒక మిక్సీ జార్ లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
3. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, తాలింపు గింజలు వేయండి.
4. ఆవాలు వేగాక ఒక రెమ్మ కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, యాడ్ చేసుకుని, వేగిన నూనెలో మిక్స్ చేసుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
5. దొండకాయలకి ఉప్పు యాడ్ చేసుకుని, రెండు నిముషాలు వేయించుకోవాలి. రెండు నిముషాల తర్వాత పసుపు యాడ్ చేసుకుని, లో ఫ్లేమ్ లో మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.
6.ఇప్పుడు బాండీ పై మూత పెట్టి, మధ్య మధ్య లో కలుపుతూ దగ్గరికి అయ్యేంతవరకు వేయించుకోవాలి.
7.ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు తీసుకుని , ఎండుకారం యాడ్ చేసుకని, వెల్లుల్లి రెబ్బలువేసి, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
8. ఇప్పుడు వేగుతున్న దొండకాయల్లో ఉల్లిపాయ పేస్ట్ ను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
9. ధనియాల పొడి యాడ్ చేసి, లో ఫ్లేమ్ లో దగ్గరపడేవరకు వేయించుకోవాలి
10. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే దొండకాయ ఉల్లి కారం రెడీ.