డిగ్రీ అర్హతతో విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగం.. ఈ యువతి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే

www.mannamweb.com


డిగ్రీ అర్హతతో ( degree qualification ) విదేశాలలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదు. విదేశాల్లోని ప్రభుత్వ వైద్య రంగంలో నన్నం నిస్సీ లియోన్ కొలువు సాధించడం గమనార్హం.

గుంటూరు జిల్లాలోని సంగం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన నిస్సీ( nissy ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిస్సీ తండ్రి చర్చి పాస్టర్ కాగా పదో తరగతిలో నిస్సీ 9.7 జీపీఏ సాధించారు. ఇంటర్ లో నిస్సీ బైపీసీ గ్రూప్ ను ఎంచుకోగా 915 మార్కులు వచ్చాయి.

బీఎస్సీ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ ( BSc Cardio Vascular Technology )చదివిన నిస్సీ ఆ తర్వాత హైదరాబాద్ లో సంబంధిత విభాగంలో ట్రైనీగా చేరారు. ఆ తర్వాత ఐ.ఈ.ఎల్.టీ.ఎస్ పరీక్ష రాశానని ఆ తర్వాత అక్కడికి వెళ్లడానికి ట్రాన్స్ థాసిక్ ఎకో కార్డియోగ్రఫీ పరీక్షకు ప్రిపేర్ అయ్యానని రెండో ప్రయత్నంలో నిస్సీ ఆ పరీక్ష కూడా పాసయ్యారు. ఆ తర్వాత యూకే నుంచి వచ్చిన డెలిగేట్స్ నేరుగా ఇంటర్వ్యూ చేశారని ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యానని నిస్సీ పేర్కొన్నారు.

నిస్సీ ఏకంగా 37 లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపిక కావడం గమనార్హం. ప్రకారా అనే సంస్థ నాకు సాయం చేసిందని నిస్సీ వెల్లడించారు. ప్రస్తుతం ఫేర్ ఫీల్డ్ జనరల్ హాస్పిటల్ లో స్పెషలిస్ట్ ఎకో కార్డియోగ్రాఫర్ గా చేస్తున్నానని నిస్సీ పేర్కొన్నారు. మొదటి రెండు నెలలు ఫ్రీగా వసతి సౌకర్యం కల్పించారని నిస్సీ వెల్లడించారు. ఈ సర్వీస్ లో ఉన్నవాళ్లకు ఇక్కడ పెన్షన్ స్కీమ్ ఉంటుందని ఆమె తెలిపారు.

ఇక్కడ వర్క్ కల్చర్ బాగుందని నిస్సీ అన్నారు. గతంలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయని నాకు తెలియదని ఆమె తెలిపారు. ఈ జాబ్ లోకి రాకముందు విదేశాల్లో పీజీ చేయాలని అనుకున్నానని నిస్సీ వెల్లడించారు. నాకొచ్చే జీతంతో పీజీ పూర్తి చేయడంతో పాటు సంబంధిత కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నానని నిస్సీ పేర్కొన్నారు.