ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన ఈ బ్యూటీ..ఇప్పుడు ఇడ్లిలు అమ్ముకుంటుంది..ఎవరో గుర్తు పట్టారా..!

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన ఈ బ్యూటీ..ఇప్పుడు ఇడ్లిలు అమ్ముకుంటుంది..ఎవరో గుర్తు పట్టారా..!


సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. ఈ మాయా లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ..? ఎవ్వరు గెస్ చేయలేరు .. అప్పటివరకు స్టార్ గా ఉన్న సెలెబ్రెటీ వెంటనే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు.

అప్పటి వరకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నా.. పెరిగిపోతున్న కాంపిటీషన్ కి ఇండస్ట్రీలో కొత్త కొత్త బ్యూటీస్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో చాలామంది టాలెంట్ ఉన్న యాక్టర్స్ కెరీర్ ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది . చాలామంది ఆ లిస్టులోకి వస్తారు . అయితే అలా టాలెంట్ ఉన్నా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఇడ్లీ అంగడి పెట్టుకొని బతుకుతున్న ఒక నటి గురించి ఇప్పుడు మనం చదవబోతున్నాం తెలుసుకోబోతున్నాం..!!

ఎన్నో సీరియల్స్ లో నటించి కొన్ని కొన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరు కాదు గీత . బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. మనసు మమత – గృహప్రవేశం – నిన్నే పెళ్ళాడుతా – రాధమ్మ కూతురు – గుప్పెడంత మనసు – నాలుగు స్తంభాలాట వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాలల్లో కూడా నటించింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె బలైపోయింది.

పలు సీరియల్స్ లో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీత ..సినీ కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మహర్షి – భగవంత్ కేసరి ..గేమ్ చేంజర్ సినిమాలో నటించిన కూడా ఆమెకు క్రేజ్ రాలేదు . ముఖ్యంగా చాలామంది హీరో హీరోయిన్లకు తల్లిగా నటించింది . అనుకున్నంత స్థాయి రాకపోవడంతో ఆమె ఏమాత్రం బాధపడకుండా తిరిగి తన స్వగ్రామం వెళ్లి రోడ్డు పక్కన ఒక హోటల్ నడుపుకుంటుంది. ఎవరైనా వేషం ఇస్తే మళ్లీ నటిస్తానని చెప్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇదొక మరో బెస్ట్ ఎగ్జాంపుల్ ..