Viral Video: ఇల్లాలా మజాకా..! ఉతికేయడంలో ఉపాయం.. నయా వాషింగ్ మిషన్ కనిపెట్టిన మహిళ

www.mannamweb.com


మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన వాషింగ్ మెషీన్లు ప్రజలకు బట్టలు ఉతికే శ్రమను తగ్గించాయి. కానీ దాన్ని కొనడానికి అందరి దగ్గర డబ్బు ఉండదు. విద్యుత్ వినియోగం కూడా మారుతూ ఉంటుంది.

పేదలు, సామాన్యులకు వాషింగ్‌ మెషీన్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కానీ, అలాంటి వారు కూడా తమకు అందుబాటులో ఉన్న వస్తువులను వినియోగించుకుని వాషింగ్‌ మెషీన్లను తయారు చేసిన వీడియోలు గతంలో మనం సోషల్ మీడియాలో వైరల్‌ కావటం చూశాం. గతంలో ఓ మహిళ సైకిల్‌ వీల్‌ సాయంతో వాషింగ్‌ మెషిన్‌ వంటి టెక్నిక్‌ ప్లే చేసింది. ఇప్పుడు కూడా అలాంటిదే మరో కొత్త రకం వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసింది ఓ ఇల్లాలు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక మహిళ ఇంట్లో ఇటుకలు, సిమెంట్ సహాయంతో వాషింగ్ మెషీన్ను తయారు చేసింది. దానికి ఓ వైపు నీళ్లు నిలబడేందుకు తొట్టి ఆకారంలో నిర్మించి, రెండో వైపు బట్టలు ఉతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంది.ఈ వీడియో చూసిన ప్రజలు దీనిని దేశీ వాషింగ్ మెషీన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌లో పదే పదే బకెట్ నీళ్లు మార్చకుండా.. తొట్టి కింది భాగంలో మురికి నీరు వెళ్లేలా ఇంకొ కొళాయి ఏర్పాటు చేసింది. ఇలా మురుగు నీటిని బయటకు వదలడం, ట్యాప్‌ ఓపెన్‌ చేసుకుని ఎప్పటికప్పుడు మంచి నీటిని ఆ తొట్టిలో నింపుకుంటూ బట్టలు శుభ్రం చేస్తోంది. ఇక అక్కడే తిష్టవేసుకుని కూర్చునే పని లేకుండా నిలబడే సులభంగా బట్టలన్నింటినీ ఉతికేసింది. ఈమె తెలివి చూసిన నెటిజనం ఆశ్చర్యపోయారు. ఏం తెలివి అక్క నీది అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.