ఇవి తింటే మీ ఊపిరితిత్తులు ఉక్కులా మారతాయి.. అస్సలు పాడుకావు

www.mannamweb.com


ఇవి తింటే మీ ఊపిరితిత్తులు ఉక్కులా మారతాయి.. అస్సలు పాడుకావు

Foods For Lungs Health: ఏటా భారతదేశంలో వేల మంది ఊపిరితిత్తుల అనారోగ్యంతో చనిపోతున్నారు. పర్యావరణ కాలుష్యం, సిగరెట్ పొగ తదితర కారణాలవల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం దెబ్బతింటోంది.

ఫలితంగా శ్వాసకోస సమస్యలు వస్తున్నాయి. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లంగ్స్ శరీరానికి ఆక్సిజన్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవచ్చు. ఊపిరి పీల్చుకునే సామర్థ్యం పెంచుకోవచ్చు. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

డాక్టర్ మయుర్ రస్తోగి తాజాగా ‘న్యూస్9లైవ్‌’తో మాట్లాడుతూ శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించగల ఆహారాలు, పోషకాల గురించి మాట్లాడారు. మయుర్ షార్దా యూనివర్సిటీలో న్యూట్రీషన్, డైటెటిక్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

యాంటీఆక్సిడెంట్లు ఉన్న పండ్లు, కూరగాయలు

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణాలను రక్షిస్తాయి. లంగ్స్ హెల్త్ కోసం విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. ఆరెంజ్, ద్రాక్షపండు, నిమ్మపండు వంటి సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, బీటా-కెరోటిన్ ఉంటాయి. టమాటాలు, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో క్యాటెచిన్స్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లంగ్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సాల్మన్, మాకరెల్, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్‌లో, అలాగే ఫ్లాక్స్‌సీడ్స్, చియా విత్తనాలు, వాల్‌నట్స్‌లో ఈ యాసిడ్స్ లభిస్తాయి. వీటిలో లంగ్స్‌కు మేలు చేసే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

పసుపు

పసుపులోని క్రియేటివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పసుపు వల్ల శ్వాస మార్గాల్లో వాపు తగ్గుతుంది. శ్వాసకోశ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీంతో లంగ్స్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

అల్లం

అల్లంలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. శ్వాస మార్గాల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నట్స్, సీడ్స్

బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, హాజెల్‌నట్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తాయి.

ధాన్యాలు

ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది, శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నీరు

రెస్పిరేటరీ సిస్టమ్ హెల్తీగా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. నీరు శ్వాస మార్గాలలో శ్లేష్మం స్రావాలను పలుచగా చేస్తుంది. దీనివల్ల వాటిని బయటకు పంపడం సులభతరం అవుతుంది. శ్వాసకోశ సంక్రమణల ప్రమాదం తగ్గుతుంది.

చికెన్‌, లీన్ మీట్

చికెన్, టర్కీ వంటి లీన్ మీట్స్‌లో ప్రోటీన్, జింక్‌ను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తి, శ్వాసకోశ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

పెరుగు, కేఫీర్

యోగర్ట్, కేఫీర్ వంటి ప్రోబయోటిక్-రిచ్ ఫుడ్స్‌లో పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. హెల్తీ గట్ మైక్రోబయోమ్ మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. వీటితోపాటు స్మోకింగ్ మానేయాలి. రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి.