డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. ఫస్ట్ నైట్ అవ్వగానే..?

డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. ఫస్ట్ నైట్ అవ్వగానే..?


డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు.

తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లికాకపోవడంతో.. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొద్దిరోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు.. సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

అనంతరం ఆమెను నిలదీయగా.. బాధితుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కోక్కటికి పెద్ద లిస్ట్ బయట పడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తైన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలు పెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది.