పిల్లలకు నచ్చేలా ఎగ్ లాలి పాప్స్.. పెద్దలు కూడా లాగించేస్తారు..

www.mannamweb.com


డిఫరెంట్‌గా ఉండే ఆహారాలు అంటే పిల్లలకు చాలా ఇష్టం. వీటిని ఎంతో ఇష్ట పడి తింటూ ఉంటారు. అందులోనూ రెస్టారెంట్ స్టైల్ ఫుడ్స్ అంటే మరింత ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇలా పిల్లలకు నచ్చేలా వెరైటీగా చేసే వాటిల్లో ఎగ్ లాలి పాప్స్ కూడా ఒకటి. ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. వీటిని ఎలా తిన్నా పోషకాలు చక్కగా అందుతాయి. ఎగ్స్‌తో ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు. ఇలా వీటితో ఎన్నో వెరైటీల స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ఎగ్ లాలి పాప్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఎగ్ లాలి పాప్స్ ఎలా తయారు చేస్తారు? ఎగ్ లాలి పాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ లాలి పాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, మైదా, శనగ పిండి, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, కొత్తిమీర.

ఎగ్ లాలి పాప్స్ తయారీ విధానం:

ముందుగా గుడ్లు ఉడక బెట్టి పైన పెంకు తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మైదా పిండి, శనగ పిండి, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, కొత్తిమీర అన్నీ వేసుకుని కలుపు కోవాలి. ఈ మిశ్రమం అంతా ముద్దలాగే ఉండాలి. పల్చగా అస్సలు ఉండకూడదు. కావాల్సినన్ని నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉండల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. ముందుగా చుట్టుకున్న బాల్స్‌ని వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత వీటికి ఒక టూత్ పిక్ గుచ్చాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ లాలి పాప్స్ సిద్ధం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతాయి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.