షాహీ ఆలూని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే.

www.mannamweb.com


భారత దేశం మసాలాలకు పెట్టింది పేరు. మసాలాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిల్లో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ మసాలాలతో మనం చాలా అద్భుతమైన వంటలు తయారు చేయవచ్చు.

కేవలం నాన్ వెజ్ వంటకాలే కాకుండా.. వెజిటేరియన్ ఫుడ్స్‌కి కూడా నాన్ వెజ్ టచ్ ఇవ్వొచ్చు. ఇలా నాన్ వెజ్‌కి ఏమాత్రం తగ్గని రెసిపీల్లో షాహీ బేబీ పొటాటో కూడా ఒకటి. ఇంది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ ఇంకోసారి ఖచ్చితంగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అయితే వీటిని హోటల్స్, రెస్టారెంట్లలోనే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పార్టీలకు, ఫంక్షన్‌లకు ఈ రెసిపీ యాడ్ చేయండి. తిన్నవారు వాహ్ అనక తప్పదు. మరి ఈ షాహీ ఆలూ రెసీపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

షాహీ బేబీ పొటాటోకి కావాల్సిన పదార్థాలు:

చిన్న బేబీ పొటాటోలు, ఆయిల్, కారం, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు.

షాహీ బేబీ పొటాటో తయారీ విధానం:

ముందుగా చిన్న బేబీ బంగాళ దుంపలను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. వీటిని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా వేగాలే వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మరో పాన్ తీసుకుని కొద్దిగా బటర్, ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు పచ్చి మిర్చి, ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్, కరివేపాకు వేసి పెద్ద మంట మీద ఓ ఐదు నిమిషాలు వేయించాలి.

ఆ తర్వాత ఇందులో వేయించిన బంగాళ దుంపలు వేసి మరో ఐదు నిమిషాలు పెద్ద మంట మీద స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా వేయించాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర పేస్ట్, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం పిండి.. చిన్న మంట మీద ఓ పది నిమిషాలు బాగా వేయించి.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.