చల్లని శీతాకాలంలో వలస పక్షుల సందడి.. అబ్బుర పరిచే అందాలు.. మరెక్కడో కాదు..

www.mannamweb.com


సంగీతం వినిపించినట్లు కిలకిల రావాలు.. ఆకాశానికి రంగేసినట్లు కనుచూపు మేర అందాలు.. ఎగిసిపడే సముద్ర కెరటాల దగ్గర గలగల పారే గోదావరి తీరేనా దట్టమైన పచ్చదనం విహంగాల విన్యాసాలు ఎటుచూసినా కనుల విందే..

శీతాకాలం ప్రవేశంతోనే కాకినాడ జిల్లా కోరింగలో వివిధ రకాల పక్షుల సందడి వాతావరణం నెలకొంటుంది. ఆహార అన్వేషణలో భాగంగా వేల కిలోమీటర్ల దాటి ఇక్కడకు చేరుకుంటాయి ఈ అందమైన పక్షులు.. కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యం మడ అడవుల్లో ఆహారం లభించే చోట ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆరు నెలల పాటు అక్కడ ఉండి తిరిగి ఆయా దేశాలకు వెళ్తాయి.

సైబీరియా, మంగోలియా, రష్యా చైనా ఒడిశాలోని మహానది, చంబల్ ప్రాంతాల నుండి విదేశీ వలస పక్షులు కోరింగ అభయారణ్యానికి చేరుకుంటాయి. ఇప్పటికి ఐ.పోలవరం మండలం బైరవ పాలేనికి ఇండియన్ స్కివర్ పక్షులు వచ్చాయి. నవంబరు నుండి మార్చి వరకు అభయారణ్యంలో 12 ప్రాంతాల్లో కనిపిస్తాయి. కోరంగిలోని హోప్ ఐలాండ్స్ కాకినాడ ఏటిమొగ, కుంభాభిషేకం, బీడి, బ్యాక్ వాటర్ కెనాల్, తాళ్లరేవు మండలం చొల్లం ఉప్పు మడులు, కాట్రేనికోన మండలం సాంకిమెంట్ లైట్ హౌస్, ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం ప్రాంతాల్లో కె.పొర వద్ద వలస పక్షులకు అనుకూల ప్రాంతంగా ఉంది. మడ అడవులు, చిత్తడి నేలలు వీటికి ఆహారం దొరికే ప్రాంతాలు.. సైబీరియా, మంగోలియా, రష్యా, చైనా వంటి దేశాల్లో పక్షలు ఉండే ప్రదేశాలు ఈ సీజన్లో మంచుతో కప్పేసి ఉంటాయి. ఆహార కొరత వంటి పరిస్థితుల కారణంగా అక్టోబరు నుంచి మార్చి వరకు ఇక్కడికి పక్షులు చేరుకుంటాయి. నత్తలు చేపలు జూప్లాంట్, చామస్ ఆహారాన్ని అధికంగా తింటాయి. అందుకే వివిధ రకాల అందమైన పక్షులు అనేక రకాల జాతులు పక్షులు ఒకే ప్రాంతానికి చేరుకుని కనివిందు చేస్తాయి.

2024లో 108 జాతుల పక్షులను గుర్తించారు. కోరింగ అభయారణ్యం విస్తీర్ణం 235.76 కాగా పొడవు 15 కిలోమీటర్లు. మడ అడవులు 193 హెక్టార్లలో ఉన్నాయి. జనవరిలో విదేశాల నుంచి వచ్చే పక్షులను లెక్కిస్తారు. అందులో వివిధ సంస్థలు పాల్గొంటాయి. ఒక్కోచోట అయిదుగురు చొప్పున 12 ప్రాంతాల్లో 12 బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక కెమెరాల ద్వారా పక్షులను గుర్తిస్తారు. 2011లో ఏర్పాటైన ఈ కౌంటింగ్ నేటికి కొనసాగుతోంది. 2016 నుంచి నేటికీ పక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్కిమ్మర్ ను అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చడం విశేషం.