అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. అక్కతో అనైతిక సంబంధం కోసం మేనల్లుడిని దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు హత్య జరిగిన 48గంటల్లోపే కటకటాల వెనక్కు పంపించారు. వావి వరుసలు లేని ఆ సోదరుడు.. అక్కతో పడక సుఖం కోసం.. ఎంతటి దారుణానికి ఒడికట్టాడు అన్నదానికి ఈ హత్యే ఉదాహరణ..!
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి చేతన్ అనే విద్యార్థిని గురువారం(నవంబర్ 28) రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. ఇంతలో చేతన్ తాత వచ్చి పాఠశాల వద్ద ఆరా తీయగా, ఎవరో పాఠశాల ఇంటర్వెల్ టైంలో స్కూల్ బయట చేతను బైక్‌పై తీసుకు వెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడు చేతన్ తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలుడు చేతన్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, వేట ప్రారంభించారు. సరిగ్గా 12గంటల్లోపే బాలుడు ఎక్కడ ఉన్నాడన్నది గుర్తించారు. కానీ ఆ బాలుడు అత్యంత దారుణంగా హత్యకు గురై శవంగా కనిపించాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. అసలు 12ఏళ్ల వయసున్న బాలుడిని ఎందుకు చంపారు. అంత అవసరం ఏమోచ్చింది అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరువపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి, వెంకటస్వామి దంపతులు కుమారుడు చేతన్. పుష్పవతి గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఆమె తల్లిదండ్రులతో ఉంటోంది. వారికి చేతన్ ఒక్కడే కుమారుడు. ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటి లానే గురువారం కూడా స్కూల్ వెళ్లాడు. అదే తన తల్లిని, అవ్వ తాతలను చూడటం చివరి సారి అవుతుందని ఊహించలేకపోయాడు. పాఠశాలలో ఇంటర్వెల్ సమయంలో ఆడుకునేందుకు బయటకు వచ్చాడు. అదే సమయంలో చేతన్ మేనమామ అశోక్ అనే వ్యక్తి అటుగా వచ్చాడు. అల్లుడు అంటూ పలుకరించాడు. మామలో ఉన్న విషాన్ని గుర్తించలేక ఆ బాలుడు దగ్గరకు వెళ్లాడు.
వెంటనే బాలుడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా పన్నెండున్నర సమయంలో చేతన్ తాతకు ఒక ఫోన్ కాల్ వచ్చంది. నీ మనవడు ఎక్కడున్నాడో తెలుసా అని.. పాఠశాలకు వెళ్లాడని చెప్పాగానే.. అసలు అక్కడ ఉన్నాడో? లేదో? చూసుకో అని అవతలి వైపు నుంచి వాయిస్ వచ్చింది. దీంతో హుటాహుటిన స్కూల్ వద్దకు వెళ్లగా.. చేతన్ కనిపించలేదు. వెంటనే ఉపాధ్యాయులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడు బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ద్విచక్రవాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. ఆ దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ కిడ్నాప్ చేసిన వ్యక్తుల లొకేషన్ కనిపెట్టారు. మడకశిర మండలానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో సిగ్నల్ వచ్చిందని గుర్తించారు. ఆ ప్రాంతంలో గాలించగా.. బాలుడు శవమై కనిపించాడు. దీంతో విచారణ చేపట్టగా, చేతన్‌ను మేనమామ అశోక్ చేతులు, కాళ్లు చేతులు కట్టివేసి, నోటిలో గుడ్డలు కుక్కి పొదల్లోకి లాక్కెళ్ళి యాక్సా బ్లేడ్ తో గొంతు కోసి హతమార్చినట్టు గుర్తించారు పోలిసులు. నిందితుడు అశోక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు అశోక్ నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.
సొంత అక్కతో అక్రమ సంబంధం కోసం గత కొన్ని రోజులుగా సోదరి పుష్పలతను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధానికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితుడు అశోక్.. అక్క కొడుకు చేతన్ ను కిడ్నాప్ చేసి మరో మహిళ నాగలక్ష్మితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. వావివరలు లేకుండా అక్కతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్న నిందితుడు అశోక్ తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.