ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవ్వకండి! ‘పీఎం విద్యాలక్ష్మి’ మీకోసమే

www.mannamweb.com


ఆర్థిక ఇబ్బందులతో మెరిట్​ స్టూడెంట్స్​ విద్యకు దూరమవ్వకూడదన్న సంకల్పంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం పేరు ‘పీఎం విద్యాలక్ష్మి’. ఈ స్కీమ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆర్థిక సమస్యలతో మెరిట్​ విద్యార్థులు మెరుగైన చదువుకు దూరంకాకూడదన్న సంకల్పంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం.. “పీఎం విద్యాలక్ష్మీ”! విద్యకు యాక్సెస్​ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ స్కీమ్​ వడ్డీ రాయితీలు, పూచీకత్తు లేకుండా రుణాలు, సరళీకృత ఆన్​లైన్ అప్లికేషన్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పీఎం విద్యాలక్ష్మి- ఎవరి కోసం?

పీఎం-విద్యాలక్ష్మి పథకం దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకింగ్ ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఈఐ) ప్రవేశం పొందే విద్యార్థుల కోసం ఉద్దేశించినది. నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్​ఐఆర్​ఎఫ్) ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ఇది విద్యా- పరిశోధన పనితీరు ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది.
ఇక్కడ అడ్మిషన్​ పొందాలి:

టాప్ 100లో లేదా నిర్దిష్ట కేటగిరీలు లేదా డొమైన్​లలో ప్లేస్​ పొందిన సంస్థలు.
101-200 ర్యాంకులు పొందిన రాష్ట్రస్థాయి హెచ్ఈఐలు.
అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు.

ఈ పథకం 860 టాప్ సంస్థలను కవర్ చేస్తుంది. తాజా ర్యాంకింగ్లను ప్రతిబింబించేలా జాబితాను ఏటా అప్డేట్ చేస్తారు.
పీఎం-విద్యాలక్ష్మి ఎలా పనిచేస్తుంది?

ఈ పథకం పూచీకత్తు లేదా హామీదారులు లేకుండా విద్యా రుణాలను అందిస్తుంది. ఇది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. రీపేమెంట్​ భారాన్ని తగ్గించడానికి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి:

క్రెడిట్ గ్యారంటీ: రూ .7.5 లక్షలలోపు రుణాలకు, ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారంటీని అందిస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది.

వడ్డీ రాయితీ: ఏడాదికి రూ.8 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు రూ.10 లక్షలలోపు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. మారటోరియం కాలంలో (రుణ చెల్లింపు నిలిపివేయసినప్పుడు, సాధారణంగా అధ్యయన సమయంలో) ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ఏడాదికి రూ.4.5 లక్షల వరకు సంపాదించే కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాల కింద పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది.
పీఎం-విద్యాలక్ష్మి ఫీచర్స్​..
సమ్మిళిత ఆర్థిక సహాయం:

ఈ పథకం విభిన్న ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం రూపొందించినది. ఇది తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారికి ప్రత్యేక ఆర్థిక మద్దతును అందిస్తుంది.
సరళీకృత డిజిటల్ ప్రక్రియ:

ఏకీకృత, స్టూడెంట్​ ఫ్రెండ్లీ పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణాలు, వడ్డీ రాయితీల కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ఈ వ్యవస్థ పూర్తిగా డిజిటల్, పారదర్శకత, వినియోగాన్ని సులభతరం చేయడం కోసం రూపొందించినది. ఈ-వోచర్లు లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీస) వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తారు.

ప్రొఫెషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్​పై ఫోకస్​:

ప్రభుత్వ లేదా ఉన్నత స్థాయి సంస్థల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ప్రాధాన్యత లభిస్తుంది.
ఇది ఎందుకు ముఖ్యమైనది?

2024-2031 బడ్జెట్​లో రూ.3,600 కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వృత్తి విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించే సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్), క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్​ఈఎల్) వంటి ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలకు ఇది తోడ్పడుతుంది.

అధిక ట్యూషన్ ఫీజులు, పరిమిత రుణ లభ్యత వంటి కీలక అడ్డంకులను పరిష్కరించడం ద్వారా, అర్హులైన విద్యార్థులు ఉత్తమ విద్యావకాశాలను కల్పించడం పీఎం-విద్యాలక్ష్మి టార్గెట్​. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా విద్యకు సమాన ప్రాప్యతను పెంపొందించే భారతదేశ దార్శనికతను కూడా ఇది బలోపేతం చేస్తుంది!