తాటి తేగల గురించి ఈ విషయాలు తెలిస్తే తప్పక తింటారు

www.mannamweb.com


తాటి ముంజలు, తాటి పండ్లు అందరికీ తెలుసు. అయితే వీటి నుంచే తాటి తేగలు వస్తాయనే విషయం చాలామందికి తెలియదు. తాటి పండ్లు నేల మీద రాలి సహజంగా మొలకెత్తినప్పుడు తాటి తేగలు వస్తాయి.

ఒక్సాకోరి తాటి తేగల కోసం మంచిగా నీళ్లు పారే ప్రాంతంలో రైతులు పాతి పెడతారు అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో తవ్వి తీసి ఆ కాండాలను ఉడకబెట్టి మంట మీద కాలుస్తారు.

తాటి తేగలలో ఫుల్ పోషకాలు

వాటినే తాటి తేగలు అంటారు. ఇక వీటిని వాటి పై ఉన్న పొరను తొలగించి తింటారు. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ తాటి తేగలు బోలెడన్ని పోషకాలతో ఉంటాయి. తాటి తేగల్లో పొటాషియం, విటమిన్ బి, వన్ బి టు, బి త్రీ, క్యాల్షియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.

తాటి తేగలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. ఈ తాటి తేగలను పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఒకటి తింటే మంచిది. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణ క్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గటానికి మాత్రమే కాదు ఈ సమస్యలకు మంచిది

ఇక బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మన ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల రక్త కణాలను పెంచి, మన వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్

ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఇవి నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి కాపాడతాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది.