ఆ బ్రాండ్ల మద్యం దే హవా- ప్రభుత్వ నిర్ణయంతో, ఫుల్లు కిక్కు

ఏపీలో కొత్త ఏడాది వేళ మద్యం అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానంతో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది.


రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వం రూ 99 కే మద్యం అందిస్తామని చెప్పటంతో.. ఇప్పుడు ఈ బ్రాండ్ల దే హవా కొనసాగుతోంది. 25 శాతం అమ్మకాలు ఈ బ్రాండ్ల నుంచే ఉన్నాయి. కాగా, ఈ స్థాయిలో అమ్మకాలు ఉన్నా.. ప్రభుత్వ ఆదాయం మాత్రం తగ్గుతోంది.

ఆ బ్రాండ్లే కావాలి

ఏపీలో మద్యం అమ్మకాల్లో రూ 99 మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. మద్యం అమ్మకాల్లో సగటున ఈ మద్యం అమ్మకాలు 25 శాతం మేర ఉంటున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 99 కే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీలో ఈ మద్యానికి వస్తున్న డిమాండ్ తో ఇతర లిక్కర్ కంపెనీలు సైతం ఇదే రకం మద్యం తయారీకి సిద్దం అవుతు న్నాయి. ఈ బ్రాండ్ల మద్యం అమ్మకాలు పెరగటంతో ప్రభుత్వానికి వచ్చే రెవిన్యూ తగ్గుతున్నట్లు ఎక్సైజ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో షాపుల లైసెన్సీల ఆదాయమూ తగ్గుతోంది. కానీ, వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అమ్మకాలు సాగుతున్నాయి.

అనూహ్య డిమాండ్

రూ 99 మద్యంకు వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఉన్నట్లు మద్యం వ్యాపారులు చెబు తున్నారు. ప్రతీ నెలా రూ 99 మద్యం సగటున 30 లక్షల కేసుల వరకు అమ్మకాలు సాగుతున్న ట్లు తెలుస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి ప్రతీ నెలా వీటి అమ్మకా లు క్రమేణా పెరుగుతున్నాయి. నెల మొత్తం రాష్ట్రంలో అమ్మే 30 లక్షల కేసుల్లో 99 బ్రాండ్ల మద్యమే దాదాపుగా 8 లక్షలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో చీప్‌ లిక్కర్‌ ఉన్నా అమ్మకాలు ఈ స్థాయిలో ఎప్పుడూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ ఖజానా పై

దీంతో, రానున్న రోజుల్లో ఈ 99 మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు మరిన్ని మద్యం కంపెనీలు సైతం రూ 99 కే మద్యం అందించే లా కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ అమ్మకాలతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. రూ.200 ధర ఉన్న సీసా అమ్మినప్పుడు ప్రభుత్వానికి రూ.170 ఆదాయం వస్తే.. రూ.99 సీసా అయితే అందు లో సగమే వస్తుంది. వ్యాపారుల నుంచి రూ 99 బ్రాండ్లు కావాలని ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, రూ 99 కే మద్యం అందిస్తామనే హామీ మేరకు ప్రస్తుతం ఆదాయం తగ్గుతు న్నా పెరుగుతున్నఅమ్మకాలతో తగ్గుతున్న ఆదాయం భర్తీ చేసుకునే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.