వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లో చేయ‌డం ఎలా…?

www.mannamweb.com


మ‌నకు కాస్త ఖాళీ స‌మ‌యం దొరికితే స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళ్లి ఏదో ఒక‌టి తినాల‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఎక్కువ‌గా క‌న‌బ‌డేవి ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ అన‌గానే గుర్తొచ్చే వాటిల్లో ఒక‌టి వెజ్ మంచూరియా. దీనిని ఒక‌సారి తిన్నామంటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది. అలా అని రోజు బ‌య‌ట తిన‌లేం క‌దా. ఇంట్లో కూడా వెజ్ మంచూరియాని ఈజీగా చేసుకోవ‌చ్చు.అది ఎలా త‌యారుచేసుకోవాలో, దానికి కావ‌ల‌సిన ప‌దార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కావ‌ల‌సిన ప‌దార్థాలు: 1) ఆయిల్ 2) క్యాబేజి 3)క్యారెట్ 4)ఉల్లిపాయ‌లు 5)ప‌చ్చిమిర్చి 6)ఆలుగ‌డ్డ 7)మైదా పిండి 8)కార్న్ ఫ్లోర్ 9)ఉప్పు 10)వెల్లుల్లి 11)అల్లం 12) పంచ‌దార 13)సోయాసాస్ 14) చైనీస్ చిల్లీ పేస్ట్ 15)ఆరోమాటిక్ పౌడ‌ర్

త‌యారీ విధానం: ముందుగా ఒక మెత్త‌టి క్లాత్ తీసుకొని అందులో అర‌క‌ప్పు క్యారెట్ తురుము, అర‌క‌ప్పు క్యాబేజి తురుము వేసుకొని గ‌ట్టిగా నీరు పోయేలా పిండాలి. త‌ర్వాత ఆ తురుముల‌ను ఒక గిన్నెలో తీసుకొని అందులో రెండు టేబుల్ స్ఫూన్ల కార్న్ ఫ్లోర్,రెండు టేబుల్ స్ఫూన్ల మైదా పిండి ,కొద్దిగా ఉప్పు,ఉడికిన ఆలుగ‌డ్డ‌ను వేసి బాగా క‌లిపి, చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకొని ప్ర‌క్క‌న పెట్టుకోవాలి. స్ట‌వ్ ఆన్ చేసి పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉండ‌లుగా చేసుకున్న వాటిని వేసి ఎరుపు రంగు వ‌చ్చేవ‌ర‌కు వేయించుకోవాలి.

ఒక ప్లేట్లోకి తీసుకొని ప్ర‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి,క‌ట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, అల్లం ముక్క‌లు వేసుకొని కొద్దిసేపు మ‌గ్గ‌నివ్వాలి.త‌రువాత సోయాసాస్.చైనీస్ చిల్లీ పేస్ట్, ఆరోమాటిక్ పౌడ‌ర్ ను వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని మంచూరియాలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ.