ముంబై పోలీసుల అదుపులో సైఫ్ దాడి నిందితుడు

నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలు, సైఫ్ ఇంట్లో సిబ్బంది ఇచ్చిన ఆధారాల పరంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.


నిందితుడిని మంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని అన్నారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ తాలూకా ఇమేజ్ సీసీటీవీ కెమెరాల్లో దొరికింది. దానిక తోడు ఇంట్లోని పని వారు దొంగ ఎలా ఉంటాడు, ఏం బట్టలు వేసుకున్నాడు లాంటి వివరాలను క్లియర్గా చెప్పారు.

20 పోలీస్ బృందాలు..

సైఫ్ మీద అటాక్ చేసిన దొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 11 తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగ అంతకు ముందే ఇంట్లోకి వచ్చి దాక్కుని ఉండవచ్చని..లేదా ఇంట్లోని పనివారే ఎవరైనా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ ఇంటి టెర్రస్ మీద ఫ్లోరింగ్ పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు. అనుమానితుడు చివరిసారిగా భవనంలోని ఆరవ అంతస్తులో పారిపోతున్నట్లు కనిపించాడని, లాబీలోని సీసీటీవీ కెమెరాల్లో లోపలికి వెళ్లేటప్పుడుగానీ, బయటకు వెళ్లేటప్పుడుగానీ కనిపించలేదని అంటున్నారు. దీంతో ఇంటి ప్రధాన ద్వారం గుండా అతను రాలేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.