సాధారణంగా మాంసాహారాలే మన శరీర స్టామినా పెంచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని కొంతమంది భావిస్తుంటారు. మీరు కూడా ఇలా భావిస్తుంటే పొరపాటు పడినట్లే. నాన్ వెజ్ లో లాగే వెజిటేరియన్ ఫుడ్ లో కూడా శక్తిని పెంచే, ఫిట్ గా ఉంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయట పడగలుగుతామని నిపుణులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇక్కడ సూపర్ ఫుడ్
హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేజ్ ఫుడ్ ని అందించే అనే హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ కి ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. దీనికి ప్రధాన కారణం టేస్ట్. రుచికరమైన ఫుడ్ తక్కువ ధరకే లభిస్తుండటంతో రోడ్డు పక్కన పెట్టే బండ్లు,షాపుల దగ్గరే ఎక్కువమంది తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అయితే టేస్టీ వెజ్ ఫుడ్ రుచి చూడాలనుకుంటే మాత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న శ్రీభవానీ హోం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న బండి దగ్గరకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఫ్యూర్ వెజ్ ఫుడ్ ని చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు.
ఇవి ఉంటాయ్
స్వతహాగా వెజిటేరియన్స్ అయిన తాము స్వచ్చమైన వెజ్ ఫుడ్స్ ని ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నామని భవానీ హోం పేరుతో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న వ్యాపారి భవానీ దేవి తెలిపారు. పప్పు, సాంబర్, మజ్జిగ చారు, డైలీ ఒక వెరైటీ రోటి పచ్చడి, రోజూ వెరైటీ కర్రీలు, రెండు రకాల ఫ్రైలు, రైస్ విత్ అప్పడంతో కంప్లీట్ వెజ్ మీల్స్ తమ దగ్గర లభిస్తుందని భవానీ దేవి తెలిపారు. పఠాన్ చెరు లేదా లింగంపల్లి మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. తాను తన భర్త ఇద్దరూ కలిసి వంట మొత్తం చేస్తాం అని భవానీ దేవి తెలిపారు.
ధరలు ఇలా
ధర విషయానికొస్తే కేవలం 100 రూయాలకే తిన్నంత భోజనం అందిస్తామని, ఇందులోనే ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తామని ఆమె తెలిపారు. మధ్యాహ్నాం 12 గంటలకు అమ్మడం స్టార్ట్ చేస్తామని..3 గంటల వరకు ఉంటుందని చెప్పారు. తమ దగ్గర పార్శిల్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. వెజ్ ఫుల్ మీల్స్ పార్శిల్ ధర రూ.110 అని భావానీ దేవి తెలిపారు. ప్రస్తుతం రెస్ఫాన్స్ బాగుందని, ఒక్కసారి వచ్చినవాళ్లు టేస్ట్ బాగుంటడంతో మళ్లీ మళ్లీ తినడానికి వస్తున్నారని..భవిష్యత్తులో వర్కర్స్ ని కూడా పెట్టుకొని ఫుడ్ ఐటమ్స్ పెంచాలనుకుంటున్నట్లు భవానీ దేవి తెలిపారు.
































