Best Mileage Car: రూ.4.7 లక్షలకే 23 కి.మీ. మైలేజ్ ఇచ్చే కారు ఇదిగో

5 సీటింగ్ కార్లకు భారతదేశంలో గిరాకీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా తమ అవసరాలకు తగిన చిన్న కార్లనే కొనుక్కుంటారు. అందుకే కేవలం రూ.4.7 లక్షలకు 23 కి.మీ. మైలేజ్ ఇచ్చే కారును ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన రెనాల్ట్ తీసుకొచ్చింది. ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.


చిన్న ఫ్యామిలీస్ కి సరిపోయే కార్లకు భారతదేశంలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. SUVలు, MPVలు వచ్చినప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ తగ్గలేదు. తక్కువ ధర, మంచి మైలేజ్, మంచి పెర్ఫార్మెన్స్ వంటి కారణాల వల్ల ఈ సెగ్మెంట్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

రెనాల్ట్ క్విడ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. చిన్న కుటుంబాలకు ఇది చాలా అనుకూలమైన మోడల్. 2024 డిసెంబర్‌లో ఈ కారు అమ్మకాలు వివరాలు ఇటీవల వెలువడ్డాయి. రెనాల్ట్ ఇచ్చిన డేటా ప్రకారం గత డిసెంబర్‌లో 628 మంది ఈ కారును కొనుగోలు చేశారు.

నవంబర్‌లో 546 మంది మాత్రమే కొనుగోలు చేశారు. నెల రోజుల్లో 13.06% వృద్ధి నమోదైంది. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ రూ.4.70 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.6.45 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

ఆన్-రోడ్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రెనాల్ట్ క్విడ్ సామాన్యులకు అందుబాటులో ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 68 bhp శక్తిని, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ RXE, RXL(O), RXT, క్లైంబర్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ORVMలు, మాన్యువల్ AC, నాలుగు పవర్ విండోలు, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్లు. కారు చిన్నగా కనిపించినప్పటికీ 279 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. మైలేజ్ దాదాపు 23 కి.మీ వస్తుంది. రెనాల్ట్ క్విడ్ మంచి ఇంజిన్ పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

అల్లాయ్ వీల్స్ కారు అందాన్ని మరింత పెంచుతాయి. ఇంటీరియర్ కూడా కొత్తగా అనిపిస్తుంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రెనాల్ట్ క్విడ్ మారుతి సుజుకి S-Presso, Alto K10, Hyundai Exter, Tata Punch వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.