పవన్ అనూహ్య నిర్ణయం – గేమ్ ఛేంజర్

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి.


ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగ స్వామిగా ఉన్న పవన్.. ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసారు. రాజకీయం గా పవన్ నిర్ణయం గేమ్ ఛేంజర్ గా నిలిచే అవకాశం ఉంది.

పవన్ కొత్త వ్యూహం

పవన్ కల్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పైన గురి పెట్టారు. జమిలి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జారుతోంది. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా పవన్ డిమాండ్ కు మద్దతు లభించింది.

పవన్ యాత్ర వెనుక

ఇక, ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేరళ, తమిళ నాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పవన్ త్రివేండ్రం నుంచి ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శనకు వెళ్తున్నారు.

పవన్ డిమాండ్

ఆ తరువాత వరుసగా ప్రముఖ ఆలయాలను సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత టూర్ లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తు న్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆరెస్సెస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. దీంతో..బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇక, ఇటు ఏపీలోనూ జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.