జనవరి నెల ముగిసిన నేపథ్యంలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీలు వరుసగా తమ అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్నాయి. మొత్తం సేల్స్‌తో పాటు, విడివిడిగా మోడళ్ల వారీగా కూడా డేటాను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్(Citroen) ఇండియా ఇటీవల జనవరి 2025 అమ్మకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ నెలలో కంపెనీ అనుకున్నంత సేల్స్‌ను నమోదు చేయలేకపోయింది. ఇండియాలో సిట్రోయెన్ విక్రయిస్తున్న ఐదు మోడళ్లలో C3 మోడల్ ఒక్కటే కొంచెం మెరుగైన అమ్మకాలతో మంచి స్థానంలో ఉంది. ఈ కారును 242 మంది కొనుగోలు చేశారు. అయితే ఇదే సమయంలో C5 ఎయిర్‌క్రాస్ (Aircross) కారును మాత్రం ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దీన్ని వినియోగదారులు ఎవరు కూడా ఆదరలించలేదని డేటాను చూస్తేనే తెలుస్తుంది.
C5 ఎయిర్‌క్రాస్ కారును గత కొన్ని నెలలుగా చాలా తక్కువ మంది కొనుగోలు చేశారు. ఆరు నెలల్లో దీని అమ్మకాలు లేకపోవడం ఇది రెండోసారి. అలాగే ఈ కాలంలో కేవలం 7 మంది మాత్రమే కొనుగోలు చేశారు. ఈ కార అమ్మకాలు తక్కువగా ఉండటంపై కంపెనీ సైతం ఆలోచనలో పడింది. ఎందుకంటే ఇది వినియోగదారులకు అవసరమయ్యే అన్ని ఫీచర్స్‌తో అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉంటుంది. మైలేజ్ కూడా బాగానే వస్తుంది.
అయినప్పటికీ ఈ కారు భారతీయ వినియోగదారులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మార్కెట్లో పోటీ బాగా పెరిగిపోయింది. ఇతర కార్ల తయారీదారులు తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకునే సదుపాయాలతో కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు, ముందుగా అన్ని వివరాలను తెలుసుకుని తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటున్నారు. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఇప్పుడు పోటీతత్వ ఆటోమొబైల్ మార్కెట్లో గట్టి సవాళ్లను ఎదుర్కొంటుంది. కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుని తిరిగి మెరుగైన సేల్స్ సాధించడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు గురించిన మరిన్ని వివరాలను ఒకసారి తెలుసుకుందాం.. ఇది DW10FC 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 177 PS పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది లీటర్‌కు దాదాపు 17.5 కి.మీల మైలేజ్ ఇస్తుంది.
C5 ఎయిర్‌క్రాస్ 3D LED రియర్ ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ LED లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, LED టర్న్ ఇండికేటర్‌లు వంటివి ఎక్స్‌టీరియర్‌లో ఉన్నాయి. లోపల క్యాబిన్‌లో అధునాతన ఫీచర్స్ ఉంటాయి. 31.24 సెం.మీ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణికులకు కంఫర్ట్‌గా ఉండే మొత్తని సీట్లు, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో 5 మంది కూర్చోడానికి అనువుగా ఉంటుంది. ఈ కారులో లగ్జరీ ఫీచర్స్‌కు ఎలాంటి ఢోకా లేదు. క్లాడియా లెదర్, లెదర్-ఎఫెక్ట్ ఫాబ్రిక్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ కంఫర్ట్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్లు, డ్రాప్-ఫ్రీ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్ సర్ధుబాటు చేయగల డ్రైవర్ సీటు, లగేజీ పెట్టుకోడానికి 580 లీటర్ల కెపాసిటి కలిగిన బూట్ స్సెస్, ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి కూడా అధునాతన ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.
ఇది ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (BLIS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రివర్స్ కెమెరాతో పాటు ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ ISOFIX మౌంట్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, విండ్ స్క్రీన్ వంటి పలు అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.