మిల్లెట్ ఇడ్లీలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు పుష్కలంగా వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడానికి సహాయపడే, జీర్ణక్రియకు మేలు చేసే పాతకాలం నాటి సంప్రదాయక వంటకం మిల్లెట్ ఇడ్లీ తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం ఇక్కడ చూడండి.
మిల్లెట్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపప్పు – 1 కప్పు
ఊదలు – 1 కప్పు
రాగులు – 1 కప్పు
సజ్జలు – 1 కప్పు
కొర్రలు – 1 కప్పు
మెంతులు – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా మినపప్పు, కొర్రలు, రాగులు, సజ్జలు, ఊదలు, మినపప్పును వేర్వేరుగా రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీలో వేర్వేరుగా వేసి తగినంత నీరు పోసుకొని మెత్తని పిండిగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఆపై వేర్వేరుగా తగినంత నీరు పోసుకొని మెత్తని పిండిగా రుబ్బుకోవాలి.
-మినపప్పు పిండిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి.
-గ్రైండ్ చేసిన మిల్లెట్ పిండి, మినపప్పు పిండిని కలిపి 6 గంటలు పులియబెట్టండి. అప్పుడు మీకు ఇడ్లీ బ్యాటర్ సిద్ధమవుతుంది.
-ఇడ్లీ పాత్రలో నీరు పోసి వేడి చేయాలి.
-ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, పిండిని ప్లేట్లలో వేయాలి.
-ఇడ్లీలను 15-20 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి.
-చల్లారిన తర్వాత ఇడ్లీలను ప్లేట్ల నుండి తీసి సాంబార్ లేదా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే
– కావాలనుకుంటే మిల్లెట్ ఇడ్లీలలో మీకు నచ్చిన కూరగాయలను కూడా వేసుకోవచ్చు.