సిద్ధం సభలు గుర్తున్నాయా.? ఎలా మర్చిపోగలం.? వేలాది మంది, లక్షలాది మంది జనాన్ని పోగేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, రాజకీయ ప్రత్యర్థుల బొమ్మలు పెట్టి, వాటిని వైసీపీ కార్యకర్తలో కొట్టించి..
ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు.
డబ్బులిచ్చి జనాన్ని తీసుకురావడమే కాదు, గ్రాఫిక్స్ చేసి.. పది మందిని వంద మందిగా చూపించి.. మాయ చేయాలనుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఐదొందలు, వెయ్యి, రెండు వేలు.. ఖర్చు ఎంతైనా సరే.. జనాన్ని తరలించడమే.!
ఇంతా చేసి వైసీపీ 2019 ఎన్నికల్లో ఏం సాధించింది.? వై నాట్ 175 అని నినదించి, జస్ట్ 11 సీట్లకు పరిమితమైపోయింది. కానీ, ఆ పబ్లిసిటీ పిచ్చి మాత్రం వైసీపీకి తగ్గలేదు. మళ్ళీ మొదలైంది వైసీపీ మార్కు డ్రామా.! నిన్న విజయవాడలో, నేడు గుంటూరులో.. జనాన్ని మోహరించింది వైసీపీ.
ఐ-ప్యాక్ అనే డ్రామా కంపెనీ, ఈ మొత్తం వ్యవహారానికి కథ, స్క్రీన్ ప్లే రచిస్తున్నట్లు, జగన్ చుట్టూ వున్న జన సందోహంలో పెయిడ్ ఆర్టిస్టుల తీరుని బట్టి అర్థమవుతోంది. చిన్నా పెద్దా.. అన్న తేడాల్లేవ్. పేమెంట్లు గట్టిగానే ఇస్తున్నారు. దాంతో, పెయిడ్ ఆర్టిస్టులు చెలరేగిపోతున్నారు.
సరే, రాజకీయ పార్టీలన్నాక.. నిరసన కార్యక్రమాలకీ, బహిరంగ సభలకీ జనాల్ని తరలించడం అనేది కొత్త కాదు. కానీ, 2019 ఎన్నికల్లో చేదు అనుభవం నేపథ్యంలో కాస్తంతైనా, సోయ అనేది వుండాలి కదా వైసీపీకి.!
జనాన్ని పోగేసుకు వస్తే, దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తెరగాలి. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఏపీలో వుండి, ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయే జగన్, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లను నమ్మకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికీ వైసీపీకి అభ్యర్థులు దొరక్కపోవచ్చు.
































