TRAI: పెరిగిన మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు

డిసెంబర్ 2024లో దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకుంది. దీనిలో జియో మొబైల్, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్‌ ఐడియాల ఏయే స్థానాల్లో ఉన్నాయో టెలికాం నియంత్రణ సంస్థ TRAI మంగళవారం వెల్లడించింది. గత సంవత్సరం చివరి నెలలో జియో నెట్‌వర్క్‌లో భారీగా చేరారు..


గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్‌ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజం జియోకు ఈసారి భారీ ఊరట లభించింది. గత సంవత్సరం నవంబర్‌ నెల చివరినాటికి 118.77 కోట్లుగా ఉండగా, వీరిలో పట్టణప్రాంతాల్లో ఉన్న మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు 65.98 కోట్లు ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 52.72 కోట్లు ఉన్నారు.

అలాగే వైర్‌లెస్‌ సబ్‌స్ర్కైబర్లు 114.86 కోట్ల నుంచి 115.06 కోట్లకు పెరిగినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. గత సంవత్సరం చివరి నెలలో జియో నెట్‌వర్క్‌లోకి 39.06 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 10.33 లక్షల మంది జతయ్యారు. కానీ వొడాఫోన్‌ ఐడియా 17.15 లక్షల మంది వైర్‌లెస్‌ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. అలాగే ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.16 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్‌ 8.9 లక్షల మందిని కోల్పోయాయి.

లయన్స్ జియో ఇన్ఫోకామ్ 47.65 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ 28.93 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.