Sim Cards: ప్రపంచం సాంకేతికంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎంతో కష్టంతో చేసిన పనిని టెక్నాలజీతో ఈజీగా చేయగలుగుతున్నాం.
కానీ ఇదే సమయంలో హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. ప్రతి మంచి వెనుక చెడు ఉన్నట్లు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. అంతకంతకు హ్యాకర్లు పెరిగిపోతున్నారు. అయితే ఈ సమయంలో మన సమాచారం ఇతరులు దొంగిలించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
మనదేశంలో ఒక వ్యక్తి ఐడెటంటిటీ కోసం ఆధార్ కార్డును యూస్ చేస్తున్నాం. ఆధార్ నెంబర్ ఇస్తే మన వివరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ఈ ఐడీ కార్డు సహాయంతో ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాం. ముఖ్యంగా మొబైల్ లో సిమ్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. అయితే కొందరు మనకు తెలియకుండా ఆధార్ నెంబర్ తస్కరిసంచి సిమ్ కార్డులు తీసుకుంటారు. వీటితో చెడు పనులు చేస్తున్నారు. మరి ఈ హ్యాకింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలి? ఏం చేయాలి?
హ్యాకర్ల బెడత నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలు వచ్చాయి. కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ప్రభుత్వం అధికారికంగా ఓ వెబ్ సైట్ ను తయారు చేయించింది. దీని ద్వారా మనకు తెలియకుండా ఎవరైనా మొబైల్, ఆధార్ నెంబర్ తో మిస్ యూజ్ చేస్తున్నారా? అనే విషయాన్ని కనిపెట్టవచ్చు. మన ఆధార్ నెంబర్ ద్వారా ఎన్ని సిమ్ కార్డులు, ఎవరెవరు తీసుకున్నారు? అని కనిపెట్టవచ్చు.
అందుకోసం గూగుల్ ఓపెన్ చేసి Tafcop.sanhcarsaathi.gov.in అని టైప్ చేయండి. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇస్తే చాలు.. ఆతరువాత కింద ఉన్న క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. వెంటనే మీ రెగ్యులర్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో కనిపిస్తుంది. దీంతో ఇవి సరైనవే అయితే ఓకే.. లేకపోతే మాత్రం అక్కడున్న ఆప్షన్ తో కాంప్లైంట్ ఇవ్వొచ్చు. దీంతో మీకు తెలియని నెంబర్ ను డిసేబుల్ చేసుకోవచ్చు. ఇలా మీ ఆధార్ నెంబర్ చెడు పనులకు వాడకుండా జాగ్రత్తపడండి..