బ్యాంకు కస్టమర్లకు బిగ్ అప్‌డేట్, ఏప్రిల్ 10 దాటితే ఎక్కౌంట్లు క్లోజ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి కేవైసీ అప్‌డేట్ చేయించుకోవల్సి ఉంటుంది.


తక్షణం కస్టమర్లు అందరూ తమ ఎక్కౌంట్‌లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్ల ఎక్కౌంట్లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచనలు జారీ చేసింది. వాస్తవానికి మార్చ్ 31 గడువు తేదీగా నిర్ణయించినా ఆ తరువాత మరో పది రోజులు పొడిగించింది. ప్రస్తుతం ఏప్రిల్ 10వ తేదీలోగా బ్యాంక్ కస్టమర్లు తమ తమ ఎక్కౌంట్లకు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాలి. ఏప్రిల్ 10 లోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే మీ ఎక్కౌంట్లు క్లోజ్ కాగలవు. ముందుగా మీ బ్యాంక్‌ను సంప్రదించాలి. ఆ తరువాత మీ ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ వివరాలతో మీకు ఏ బ్యాంకులో ఎక్కౌంట్ ఉందో అక్కడికి వెళ్లి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ అడ్రస్ , ఆధార్ అన్నీ పక్కాగా ఉంటే వివిధ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ లేదా పోస్ట్ ద్వారా మీ ఎక్కౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌కు కేవైసీకు అవసరమైన పత్రాల్ని పంపించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఏప్రిల్ 10 నాటికి మీ బ్యాంక్ ఎక్కౌంట్ కేవైసీ పూర్తి కాకుంటే ఆ బ్యాంక్ ఎక్కౌంట్ తాత్కాలికంగా రద్దవుతుంది. అదే జరిగితే మీరు మీ బ్యాంక్ నుంచి డబ్బులు తీయలేరు. వేయలేరు. ఎప్పుడైతే కేవైసీ అప్‌డేట్ అవుతుందో అప్పుడే తిరిగి యాక్టివేట్ అవుతుంది.

కేవైసీ అప్‌డేట్ అయిందో లేదా స్టేటస్ చెక్ ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చుని చేయవచ్చు. ముందుగా మీ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవాలి. ఇప్పుడు వ్యక్తిగత సెట్టింగుల ఆప్షన్ ఎంచుకుని స్టేటస్ చెక్ చేసుకోవాలి. అప్‌డేట్ పెండింగులో ఉంటే స్క్రీన్‌పై మెస్సేజ్ క్పన్పిస్తుంది. కేవైసీకు కావల్సిన కాగితాలు సమర్పిస్తే సరిపోతుంది.