Kitchen Tips: రంగు, రుచి మారకుండా ఏడాది పొడవునా కొత్తిమీర నిల్వ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?

www.mannamweb.com


కొత్తిమీర ఒకటి, రెండు రోజులకు మించి ఫ్రెష్‌గా ఉండదు. ఇక ఫ్రిజ్‌లో పెడితే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కానీ కొత్తిమీర మార్కెట్లో అన్నీ కాలాల్లో అందుబాటులో ఉండదు.
కానీ చలికాలంలో లభ్యమైనంతగా వేసవి రోజుల్లో కొత్తిమీర లభించదు. అందుకే వేసవిలో కొత్తిమీర చాలా ఖరీదైనది.

చల్లటి వాతావరణంలో కొత్తిమీర బాగా పెరుగుతుంది. టబ్‌లో కొన్ని కొత్తిమీర గింజలు జల్లి సులువుగా వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు. కొత్తిమీర ఏ ఆహారానికి అయినా భిన్నమైన రుచిని ఇస్తుంది. కొత్తిమీర ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి. అయితే కొత్తిమీర ఆకులను ఇలా భద్రపరిస్తే ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చు. దాని రంగు, వాసన కూడా మారదు. కొత్తిమీర ఆకులను ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు చూద్దాం..

కొత్తిమీర కొన్న తర్వాత కొత్తిమీర ఆకులు, కాడలను వేరు చేయాలి. ఆ తర్వాత కాడలను పారేయకూడదు. కాండం భాగాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆకులను విడదీయాలి. తర్వాత ఆ ఆకులను బాగా కడగాలి. ఇప్పుడు దానిని ఇంటిలోపల న్యూస్ పేపర్ వేసి దానిపై కొత్తిమీర ఆకులను ఆరబోయాలి. ఎండలో నేరుగా ఆరబెట్టకూడదు.

కొత్తిమీర ఆకుల నుంచి అదనపు నీరు ఆరిపోయే వరకు ఎండనివ్వాలి. ఇలా మూడు రోజులు ఇంట్లో ఉంచితే ఎండిపోతుంది. ఇది మూడు రోజుల్లోనే పొడిగా మారుతుంది. చేతిలోకి తీసుకుంటే ముడుచుకుయినట్ల ఉండాలి. ఆకుల్లో ఏమాత్రం నీరు లేకుండా చూసుకోవాలి. లేదంటూ ఫంగస్ చేరి నాశనం అవుతుంది.

అవసరమైతే దానిని ఆరబెట్టడానికి మరొక రోజు గదిలో ఉంచవచ్చు. ఇప్పుడు ఒక కూజాను బాగా కడిగి శుభ్రంగా పొడిగా తుడవాలి. అందులో ఎండిన కొత్తిమీర తరుగు వేయాలి. ఈ విధంగా ఫ్రీజ్‌ అవసరం లేకుండా ఒక సంవత్సరం పాటు కొత్తిమీరను నిల్వ చేయవచ్చు. రుచి, వాసనలో ఏమాత్రం మార్పురాదు.