Numerology : పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది.
ఆ సంఖ్య ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్ల కలయిక సరిగా కుదరదు. ఇలాంటి అనుకూల, ప్రతికూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ నంబర్ ఎంతో ఇలా తెలుసుకోండి.
సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారైనా, నమ్మనివారైనా… అసలు తమ సంఖ్య (అంకె) ఎంత అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. అందుకు న్యూమరాలజీ నిపుణులు చిన్న ఫార్ములాను అమలుచేస్తారు. అది మనం కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా వారి సంఖ్య తెలుసుకోవాలంటే కచ్చితంగా వారి పుట్టిన తేదీ తెలిసితీరాలి. అంటే రోజు, నెల, సంవత్సరం తెలిసి ఉండాలి. వాటి ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు.
ఉదాహరణకు ఓ వ్యక్తి జులై 8, 1991లో పుట్టారని అనుకుంటే.. వారి పుట్టిన తేదీ 7-8-1991గా ఉంటుంది. ఈ తేదీని కలపడం ద్వారా సంఖ్య వస్తుంది. అంటే.. 7 + 8 + 1 + 9 + 9 + 1…. వీటిని కలిపితే.. 35 వస్తుంది.
ఇక్కడ 35 అనేది వారి అంకే కాదు… దాన్ని సింగిల్ డిజిట్‌కి తేవాల్సి ఉంటుంది. అంటే… 35ని కూడా 3 + 5 గా కలపాల్సి ఉంటుంది. ఆ ప్రకారం వారి సంఖ్య 8 అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరికీ 1 నుంచి 9 లో ఏదో ఒక అంకె కచ్చితంగా ఉంటుంది. ఆ అంకె ఆధారంగా న్యూమరాలజిస్టులు వారి జాతకాన్ని చెబుతారు.
కొంతమంది న్యూమరాలజిస్టులు ఈ మధ్య మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం వారు వ్యక్తుల పేర్లను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఆ పేర్లలోని ఇంగ్లీష్ లెటర్స్‌కి నంబర్లు కేటాయించి… వాటిని కలుపుతూ.. సింగిల్ డిజిట్ వచ్చేలా చేస్తున్నారు. కానీ ఇందులో ఇంటి పేరు కలపాలా వద్దా అనేది సమస్య అవుతోంది. అందువల్ల పేర్లను కలిపి తెలిపే న్యూమరాలజీకి అంతగా గుర్తింపు లేదు. పుట్టిన తేదీయే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందువల్ల న్యూమరాలజీపై ఆసక్తి ఉన్న వారు.. తమ అంకెను… పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని నిర్ధారించట్లేదని గమనించగలరు.