మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 31న సీఎం జగన్ ధ్యక్షతన ఏపీ మంత్రి వర్గం సమావేశం కానుంది.
వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల లో ప్రవేశ పెట్టె బడ్జెట్ పై చర్చించనున్నారు. వచ్చే నెలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు అలాగే.. జగనన్న కాలనీలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించనున్నారు.
ఎన్నికల ముందు ఏపీలోని రైతు సోదరులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి భారంగా పడిన పంట రుణాలను మాఫీ చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఈ నెల 31న జరిగే కేబినెట్ భేటీలో రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే రాష్ట్రంలోని రైతుల ఓట్లన్నీ వైసీపీ ప్రభుత్వానికి పడుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే దారిలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.