Child Mobile : పిల్లలు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఇలా చేయండి.

Child Mobile : ప్రపంచంలో ఏ విషయం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అందుకు కారణం మొబైల్ మాత్రమే. మొబైల్ లో ఇంటర్నెట్ ఉంటే చాలు అవసరమున్న ప్రతీ విషయాన్ని తెలుసుకోవచ్చు.
అయితే కొందరు మొబైల్ ను అవసరం కోసం వాడుతుండగా.. మరికొందరు సరదా కోసం యూజ్ చేస్తున్నారు. అయితే చిన్న పిల్లలు మాత్రం దీనికి బానిస అయిపోతున్నారు. చిన్నపిల్లలు మారం చేస్తున్నారని వారికి ఒక్కసారి మొబైల్ చూపిస్తే.. ఆ తరువాత దానికి బానిసగా మారుతున్నారు. అయితే మొబైల్ వాడకం వల్ల చిన్న పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే?


ప్రతీ మొబైల్ నుంచి రేడియేషన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది ఎక్కువగా మెదడుపై ప్రభావం పడుతుంది. 2011 ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ పై పరిశోధన జరిపి 30kHz-300 GHz ఫ్రీక్వెన్సీ పరిధిలో నాన్ యోనైజింగ్ రేడియేషన్ ను విడుదల చేసే పరికరాల నుంచి విడుదలయ్య రేడియేషన్ క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చింది. డిజిటల్, సాంకేతిక పరికరాలు ద్వారా ఎక్కవ రేడియేషన్ విడుదల అవుతున్నందున ఇది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు.
చిన్న పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే వెంటనే వారికి మొబైల్ ఇచ్చి ఊరుకుంచుదాం. కాని ఇది రాను రాను వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం వల్ల మెదడుపై ప్రభావం పడి భవిష్యత్ లో అనేక రకాలుగా అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మొబైల్ ను దూరంగా ఉంచాలి. ఇతర విషయాలు మాట్లాడుతూ వారికి గారాభం చేయాలి. అంతేకాని మొబైల్ వాడడం వల్ల నష్టాలే కానీ లాభాలు ఏమాత్రం ఉండవని అంటున్నారు.

అయితే మొబైల్ కు అడిక్ట్ అయిన వాళ్లను వాటి నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. వారికి మొబైల్ కు ప్రత్యామ్నాయంగా ఇతర వ్యాపకాలు అలవాటు చేయాలి. ఫిజికల్ గా ఆటలను నేర్పించాలి. మంచి మాటలు చెప్పాలి. చెస్, క్యారమ్ లాంటి గేమ్స్ ను ప్రోత్సహించాలి. ఇలాంటి వాటితో మొబైల్ కు దూరంగా ఉంచాలి. లేదంటే భవిష్యత్ లో మైబైల్ తప్ప వారికి మరో ప్రపంచం కనిపించదు. అంతేకాకుండా మానవ సంబంధాల విషయాల్లో కూడా పెద్దగా పట్టించుకోరు.