పప్పు, బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు! – పది నిమిషాల్లో క్రిస్పీ “పునుగులు”

బియ్యం పిండి, మైదా లేకుండా పునుగులు తయారు చేసుకోవచ్చు. అంతే కాదు! వీటిని అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసి ప్లేట్లలో సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ పునుగులు బ్రేక్ ఫాస్ట్ లోకి సాయంత్రం స్నాక్స్ గా ఎంతో బాగుంటాయి. పునుగులు అనగానే బియ్యం నానబెట్టి, కడిగి, పిండిపట్టి గంటల కొద్ది మ్యారినేట్ చేయడం లాంటి ప్రాసెస్ ఎంతో ఉంటుంది. కానీ, ఇలాంటి పునుగులు చేయడం ఈజీ, పైగా రుచికరంగా ఉంటాయి. ఇంట్లో చేసుకునే ఈ పునుగుల్లో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చి మిర్చి కూడా వేసుకోవడం వల్ల రుచి అద్దిరిపోతుంది.


కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ – 1 కప్పు
  • గోధుమ లేదా మైదా – పావు కప్పు
  • చిక్కటి పెరుగు- అర కప్పు
  • నీళ్లు – అర కప్పు
  • పచ్చి మిర్చి – 3
  • అల్లం వెల్లుల్లి – అర స్పూన్
  • కరివేపాకు – 2రెమ్మలు
  • కొత్తిమీర – కొద్దిగా
  • ఉప్పు – రుచికి సరిపడా
  • ఉల్లిపాయ – 1
  • జీలకర్ర – అర టీ స్పూన్
  • వంట సోడా – అర టీ స్పూన్
  • తయారీ విధానం :

    • ముందుగా మిక్సింగ్​ బౌల్​లో బొంబాయి రవ్వ, గోధుమ లేదా మైదా పిండి కలుపుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అర కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇది పుల్లటి పెరుగు అయితే పునుగుల రుచి చాలా బాగుంటుంది. పెరుగు బాగా కలిసేలా అర కప్పు నీళ్లు పోసుకుని గరిటెతో బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు.
    ఈ లోగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. పది నిమిషాల్లో బ్యాటర్ గట్టిపడిన తర్వాత అందులోకి పచ్చి మిర్చి తరుగు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఆపై అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వంట సోడా వేసుకుని అన్నీ కలిసేలా రెండు స్పూన్ల నీళ్లు పోసుకుని మరో సారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇపుడు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవచ్చు.
  • ఇపుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. హై ఫ్లేమ్​లో నూనె వేడి చేసి పునుగులు వేయడానికి ముందు మీడియంలోకి మార్చుకోవాలి.
  • ఇపుడు పునుగులు వేసుకున్నాక తక్కువ మంటలో వేయించుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై చేసుకుని నూనె లోంచి తీసేయడమే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.