జపాన్ ప్రజల దీర్ఘాయువు రహస్యం బయటపడింది.. ఇలా చేస్తే 100 ఏళ్లు సులభంగా జీవించవచ్చు.

 మధ్య కాలంలో తరచూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఫిట్ నెస్ గురించి ప్రజలకు ఎక్కవగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన తరుచుగా తన ఉపన్యాసాల్లో కూడా ఫిట్ నెస్ గురించి ప్రస్తావిస్తుంటారు.


ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండటం చాలా అవసరం.ఈ బిజీ లైఫ్ స్టైయిల్ లో చాలామంది తాము తక్కువ టైంలోనే ఫిట్ నెస్ సాధించాలని కోరుకుంటారు. ఈ కోరికే జపనీస్ వాకింగ్ ను పాపులర్ చేసింది. ప్రస్తుతం జపనీస్ వాకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్(IWT)అని పిలుస్తుంటారు. దీని అద్భుతమ ప్రయోజనాలు తెలిశాయంటే మీరు కూడా ఈ రోజు నుంచే దీన్ని స్టార్ట్ చేస్తారు.

IWT అంటే ఏమిటి?

నిజానికి IWT చాలా సులభం. IWTలో మూడు నిమిషాల పాటు చురుకైన నడక, మూడు నిమిషాల పాటు సులభమైన నడక విరామాలు ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలు కలిపి 30 నిమిషాల సెషన్‌ లో 5 సార్లు పునరావృతమవుతాయి. అంటే మీరు 30 నిమిషాల నడకలో 3 నిమిషాలు వేగంగా 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఈ పద్ధతి మీ ఫిట్‌ నెస్‌ ని మెరుగుపర్చడమే కాకుండా మీ వయస్సును తగ్గించుకున్నట్లు కనిపించంలో కూడా సహాయపడుతుంది.

IWT ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా నెమ్మదిగా నడవడం కంటే IWT మీ జీవక్రియ, గుండె ఆరోగ్యం, కొవ్వును కరిగించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జపాన్ లో జరిగిన శాస్త్రీయ పరిశోధనలు ఈ నడక శైలిని అనుసరించిన వ్యక్తులలో కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు,కండరాల బలం కూడా మెరుగుపడ్డాయని నిరూపించాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక 68 ఏళ్ల వ్యక్తి చురుకైన నడక సమయంలో తన హృదయ స్పందన రేటును నిమిషానికి 130 బీట్స్ పెంచుకున్నాడు.. ఇది మితమైన సైక్లింగ్ సెషన్‌కు సమానం.

IWTలో కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా నడవడం వల్ల శరీర శక్తి ఉత్తేజితమవుతుంది. ఇది జీవక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ మోడల్ మీ హార్ట్ బీట్ రేటును పెంచుతుంది, కండరాల సమన్వయాన్ని, వృద్ధులలో సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది, అవయవాలను విషరహితం చేస్తుంది, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది.

ఇలా కూడా

మీరు మీ 30 నిమిషాల జపనీస్ నడకకు మరింత తీవ్రతను జోడించాలనుకుంటే కొన్ని వైవిధ్యాలను ప్రయత్నించవచ్చు. మీ నడకకు తేలికపాటి బరువులను జోడించడం వల్ల మీ కండరాలు టోన్ అవుతాయి, ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. మీరు ఇంట్లోనే వ్యాయామం చేయాలనుకుంటే జిగ్ జాగ్ మార్గాలు, వెనుకకు నడకలు లేదా ఫిగర్-8 ట్రాక్‌లు వంటివి ట్రై చేయండి. ఇవి మీ కండరాలను సక్రియం చేయడమే కాకుండా మీ మనస్సును కూడా బిజీగా ఉంచుతాయి. ఈ జపనీస్ నడక కేవలం వ్యాయామం కాదండోయ్ ఇది మీ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును పెంపొందించే ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.