రేషన్ బియ్యం విషయంలో ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరుక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా జరుగుతున్న పంపిణీని నిలిపివేస్తారు.
గతంలో ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాల కొనుగోలు
రేషన్ కార్డు దారుల ఇంటి వద్దకే రేషన్ చేరవేస్తామని చెప్పిన గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వాహనాలను కొనుగోలు చేసింది. ఈ వాహనాకు 2021 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. మొత్తం 9,260 వాహనాలు రూ. 539 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా SC, ST, BC, , మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని అందించారు. ఇంటింటికి రేషన్ అందించే ఉద్దేశంతో ప్రారంఏభించినా.. గగతంలోలా .. ఓ వీధి చివర ఉంటే..అక్కడకు వెళ్లి లబ్దిదారులు బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది.
ప్రతి వీధికి ఎప్పుడో ఓ సారి వచ్చే వాహనాలు
గతంలోలబ్దిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకునేవారు. కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరికో… వాళ్లు బండి పెట్టిన ప్రాంతానికో పరుగెత్తుకుంటూ వెళ్లారు. రేషన్ దుకాణమే కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది. ఈ ఎండీయూ వాహనాల వల్ల అటు ఆ వాహనాలు పెట్టుకున్న వారికి ఉపయోగం లేదు. తమకు గిట్టుబాటు కావడం లేదని వారు కూడా చాలా సార్లు ఆందోళనకు దిగారు. రేషన్ దుకాణదారులు కూడా పాత పద్దతిలో సేవలు చేయడానికి తాము సిద్దమేనని ప్రకటించారు.
రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ఈ వాహనాలు కారణమయ్యాయని ఆరోపమలు
అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, ఎండీయూ వాహనాల కొనసాగింపుపై సమీక్ష జరిగింది. ఇటీవల పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు, ఈ సేవలను కొనసాగించాలా వద్దా అనే దానిపై చర్చించారు. ఎండీయూ వాహనదారులు పౌర సరఫరా విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ వాహనాల వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 830 కోట్ల అదనపు ఖర్చు అవుతోంది.
ఇవన్నీ ఆలోచించి.. రేషన్ దుకాణాల ద్వారానే ఇక రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎండీయూ వాహనాలను ఎలా ఉపయోగిస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉందది. అయితే వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటికే రేషన్ పంపిస్తారు.
































