రిలయన్స్ జియో తన వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన మరియు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ భారత టెలికాం మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు తక్కువ ధరకే ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, మరియు OTT సబ్‌స్క్రిప్షన్‌లతో భారత టెలికాం మార్కెట్‌లో వినియోగదారులకు అత్యంత విలువైన ఎంపికలను అందిస్తున్నాయి.
జియో రూ.121 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 60 డేస్ వ్యాలిడితో అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఇది బడ్జెట్‌కు తగిన ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు.. అలాగే రోజువారీ డేటా పరిమితి లేకుండా, ఇంటర్నెట్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్, మరియు డౌన్‌లోడ్‌లకు ఇది అనువైనది.అయితే ఈ ప్లాన్ డేటా-మాత్రమే బూస్టర్ ప్లాన్, కాబట్టి దీనిలో టాక్‌టైమ్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు.
జియో రూ.198 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 14 డేస్ వ్యాలిడితో అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB 4G డేటా (మొత్తం 28GB), అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మరియు JioTV, Jio Cinema వంటి జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇది జియో యొక్క అత్యంత సరసమైన పూర్తి-ప్యాకేజీ ప్లాన్‌లలో ఒకటి. ఇది తక్కువ వ్యాలిడిటీతో ఎక్కువ డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు.
జియో రూ.239 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 22 డేస్ వ్యాలిడితో అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్‌ను అందిస్తుంది. రోజుకు 1.5GB 4G డేటా, అన్‌లిమిటెడ్ వాయస్ కాల్స్, రోజుకు 100 SMS, మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు JioTV, JioCinema, మరియు JioCloud యాక్సెస్ కూడా ఉంటుంది. రోజువారీ డేటా మరియు కాలింగ్ అవసరాలు ఉన్నవారికి, ముఖ్యంగా 5G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ ప్లాన్ ఆకర్షణీయంగా ఉంటుంది.
జియో రూ.195 ప్లాన్ : ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా మరియు Jio Hotstar సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇది క్రికెట్ ప్రియులకు మరియు ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారికి అనువైనది.
































