ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ సిద్ధమవుతోంది అని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో 2025-26 కు గాను మొత్తం వర్కింగ్ డేస్ 233 కాగా, హాలిడేస్ 83 రోజులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఫుల్ జాబితా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్ 2020-26 కు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వర్గాల కీలక సమాచారం అందించాయి. ఇక వచ్చే ఏడాదిలోగా 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజుల హాలిడేస్ వచ్చాయి.
అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జనరల్ స్కూళ్లకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు రానున్నాయి. ఇక జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు మంజూరు చేయనున్నారు. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 21 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్ ప్రకటించనున్నాయి.
ఇవి కాకుండా మరిన్ని ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్నీ కలిసి మొత్తంగా ఎక్కువ మొత్తంలోనే విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు వచ్చాయి, అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
అయితే తెలంగాణలో స్కూళ్ల అకడమిక్ క్యాలండర్ ప్రకారం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. అయితే తెలంగాణ దసరా హాలిడే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు మంజూరు చేశారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు రానున్నాయి.
అయితే, 2026లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతాయి. జూన్ 1 స్కూళ్లు పునః ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే స్కూల్లో హాలిడేస్ లో ఉన్న పిల్లలు సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది సమ్మర్ క్యాంపులకు అటెండ్ అవుతున్నారు.