ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం వినియోగించే బియ్యం, కూరగాయలు, ఇతర వాటిని పండించే సమయంలో రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. వాటి వల్ల అనేక దుష్ఫ్రభావాలు కలుగుతున్నాయి. తద్వారా వివిధ రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడి నీటికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. కూరగాయలు, పండ్లను దానిలో కడగడం వల్ల బ్యాక్టీరియా పోతుంది. వేడి నీటికి తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దీంతో ఎలక్ట్రిక్ కెటిల్ ల వినియోగం బాగా పెరిగింది. దీనిలో నీటిని మరిగించుకుని, వివిధ పనులు వాడుకోవచ్చు, టీ, కాఫీలను పెట్టుకోవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో ప్రముఖ బ్రాండ్ల కెటిల్ లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
సురక్షితమైన, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ కెటిల్ లలో విప్రో ఎలాటో బీకే 215 కూల్ టచ్ ఒకటి. భద్రత, సామర్థ్యం రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చి తయారు చేశారు. దీనిలోని ట్రిపుల్ లేయర్ టెక్నాలజీతో వినియోగదారులకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఓవర్ హీటింగ్, డ్రై బాయిల్, అదనపు ఆవిరి నుంచి పూర్తిస్థాయి భద్రత పొందవచ్చు. తుప్పు పట్టకుండా నిరోధించే యాంటీ రస్ట్ షీల్డ్, సూపర్ ఫాస్ట్ హీటింగ్, వన్ టన్ ఓపెనింగ్, రెండేళ్ల వారంటీతో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ లోఈ కెటిల్ రూ.1,899కు అందుబాటులో ఉంది.
సొగసైన డిజైన్, తుప్పు పట్టని స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో ఫిలిప్స్ హెచ్ డీ 93632 కెటిల్ అందుబాటులోకి వచ్చింది. కూల్ టచ్ హ్యాండిల్, మూతతో దీన్ని వినియోగించడం చాలా సులభం. టీ, కాఫీ, ఇతర వేడి పానీయాల కోసం నీటిని త్వరగా మరిగిస్తుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫీచర్ తో నీరు మరిగిన తర్వాత దానికదే ఆగిపోతుంది. సింగిల్ టచ్ లిడ్ లాకింగ్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ కెటిల్ ను అమెజాన్ లో రూ.1,949కి కొనుగోలు చేయవచ్చు.
వంట గదికి అందాన్నివ్వడంతో పాటు రోజు వారీ అవసరాల కోసం పీజియన్ బై స్టోవ్ క్రాఫ్ట్ హాట్ ప్లస్ ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగంగా ఉంటుంది. క్లాసిక్ మ్యాట్ ఫినిషింగ్ తో డిజైన్ చాాలా బాగుంది. ముఖ్యంగా 1500 వాట్స్ హీటింగ్ ఎలిమెంట్ తో కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో నీటిని మరిగిస్తుంది. టీ, కాఫీ, ఇన్ స్టంట్ న్యూడుల్స్, సూప్ తదితర వాటిని తయారు చేసుకోవచ్చు. వినియోగం తర్వాత చాాలా తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.549 మాత్రమే.
అత్యుత్తమ ఎలక్ట్రిక్ కెటిల్ లలో హాఫెల్ డోమ్ ప్లస్ ముందు వరసలో ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, మంచి నాణ్యతతో పాటు భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. దీనిలోని యూకే స్ట్రిక్స్ కంట్రోల్ థర్మోస్టాట్ ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తుంది. అనలాగ్ డిస్ ప్లే, ఎల్ఈడీ సూచిక లైట్, బాయిల్ డ్రై రక్షణ, మైక్రో మెస్ ఫిల్టర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.అమెజాన్ లో ఈ కేటిల్ రూ.3,980కి అందుబాటులో ఉంది.
ఇంటితో పాటు కార్యాలయంలో వినియోగించుకోవడానికి ఫిలిప్స్ డబుల్ వాల్ట్ కెటిల్ చాలా బాగుంటుంది. రోజు వారీ అవసరాల కోసం నీటిని మరిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని ప్రత్యేక టెక్నాలజీ నీటిని ఎక్కువ సేపు వేడిగా ఉంచేలా చేస్తుంది. 6ఏ చిన్న ఫ్లగ్ తో 1.5 లీటర్ల సామర్థ్యం, ఆటోషట్ ఆఫ్ ఫంక్షన్, రెండేళ్ల వారంటీ తదితర ప్రత్యేకతలతో తీసుకువచ్చారు. ఈ కెటిల్ ను రూ.2,549కు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
Post Views:136
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.