మీరు థాయిలాండ్ ‘తాజ్ మహల్’ చూశారా? దాని అందం మీ మనసును ఆశ్చర్యపరుస్తుంది.

భారతదేశ తాజ్ మహల్ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. దీనిని తెల్లని పాలరాయితో నిర్మించారు. ఇది చాలా అందంగా ఉంటుంది. అయితే థాయిలాండ్‌లో కూడా తాజ్ మహల్ వంటి తెల్లని, అందమైన ప్రదేశం ఉందని మీకు తెలుసా.. ఇది ఇప్పుడు పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రోజు థాయిలాండ్ లోని వైట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం..

భారతదేశంలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అందంగా ఉంటుంది. దీనిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. అంతేకాదు ఈ అందమైన కట్టడం తాజ్ మహల్ ను ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా చేర్చారు. అయితే థాయిలాండ్‌లో కూడా తాజ్ మహల్ వంటి అందమైన నిర్మాణం ఉందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ భవనం పూర్తిగా తెల్లగా, చాలా అందంగా ఉంటుంది. అవును ఈ రోజు థాయిలాండ్‌లోని వైట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం.. దీనిని స్థానిక భాషలో వాట్ రోంగ్ ఖున్ అని పిలుస్తారు.


థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్‌లో ఉన్న ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారింది. దీనిని శ్వేత దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకున్న వెంటనే.. చూపరులకు కాలం ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. తెల్లని పాలరాయి, గాజు రాళ్ల మెరుపు, కళాకారుడి రూపకల్పన కలిసి శ్వేత దేవాలయాన్ని పూర్తిగా ప్రత్యేకమైనదుగా చేశాయి. స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. శ్వేత దేవాలయం అందం గురించి ఎంత చెప్పినా తక్కువే..

వైట్ టెంపుల్ ఎక్కడ ఉంది?

శ్వేత దేవాలయం థాయిలాండ్ ఉత్తర భాగంలోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్ లో ఉంది. ఈ నగరం బ్యాంకాక్ నుంచి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిలాండ్ సందర్శించే పర్యాటకులను ఆకట్టుకుంటూ.. ఈ శ్వేత దేవాలయం వేగంగా ప్రజాదరణ పొందుతోంది.

శ్వేత దేవాలయ చరిత్ర వాట్ రోంగ్ ఖున్ కథ సాధారణ ఆలయం లాంటిది కాదు. 1997 లో థాయిలాండ్ ప్రసిద్ధ కళాకారుడు చలెర్మ్‌చై కోసిట్‌పిపాట్ ఊహకు పోసిన ప్రాణం. తన కళని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. గతంలో ఇది పాత ఆలయం.. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడు కళాకారుడైన చలెర్మ్‌చై కోసిట్‌పిపాట్ ఈ ఆలయాన్ని పునః నిర్మించాలని కోరుకున్నాడు. పూర్తిగా తన సొంత ఖర్చుతో ఈ ఆలయానికి సరికొత్త రూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆధునిక కళా దేవాలయంగా మార్చాడు.

శ్వేత దేవాలయ విశేషాలు. తెలుపు రంగు, గాజు మెరుపు: ఆలయ నిర్మాణం మొత్తం తెలుపు రంగు పాలరాయితో తయారు చేయబడింది, ఇది స్వచ్ఛత, పవిత్రతను సూచిస్తుంది. దీని గోడలపై గాజు ముక్కలు పొందుపరచబడి ఉంటాయి. అవి సూర్యకాంతిలో ప్రకాశిస్తాయి. ఆలయాన్ని స్వర్గంలా అందంగా కనిపించేలా చేస్తాయి. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దీని వాష్‌రూమ్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది.

స్వర్గం.. నరకం మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది: ఆలయ ప్రధాన ద్వారం చేరుకోవడానికి ఒక వంతెనను దాటాలి. దీని కింద చేతుల చాచిన బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ‘నరకం’ చిహ్నాలు, ఆత్మ స్వర్గంలోకి ప్రవేశించే ముందు నరకం ద్వారా వెళ్ళాలని సూచిస్తుంది.

చూడవలసినవి: ఆలయం లోపల సాంప్రదాయ మతపరమైన చిత్రాలను అలాగే ఆధునిక పాప్-సంస్కృతి చిత్రాలను చూడవచ్చు. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, హలో కిట్టి, టెర్మినేటర్ లాగానే.

సందర్శించడానికి సరైన సమయం? నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు థాయిలాండ్‌లో వాతావరణం చల్లగా , ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. జనసమూహం కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో థాయిలాండ్‌లోని ఈ శ్వేత దేవాలయాన్ని సందర్శించవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.