ఏపీ సీఎం చంద్రబాబు ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు.
ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో దిగ్గజ కంపెనీ ఎన్‌వీడియాతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. ఎన్‌వీడియా సంస్థ మద్ధతు రాష్ట్రంలో 10వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. రాబోయే రెండేళ్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి 500 ఏఐ స్టార్టప్‌లు ప్రారంభం కానున్నాయని అన్నారు. విద్య, నైపుణ్య నుండి పరిశోధన, ఆవిష్కరణ వరకు రాష్ట్రం పునాది వేస్తుందని చెప్పారు.
































