5 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్

క్యాన్సర్‌ చికిత్సకు వాడే నివోలుమాబ్‌ ఔషధాన్ని 5 నిమిషాల్లో ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే ఆవిష్కరణను ఇంగ్లాండ్‌ పరిశోధకులు కనుగొన్నారు. నివోలుమాబ్‌ ఔషధాన్ని ఐవీ డ్రిప్‌ ద్వారా ఇవ్వడానికి గంట సమయం పడుతుంది. అయితే దానిని ఇంజక్షన్‌ రూపంలో 5 నిమిషాల్లో ఇవ్వొచ్చని ఇంగ్లాండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, మూత్రాశయం వంటి 15 రకాల క్యాన్సర్ల నివారణకు ఈ ఇంజెక్షన్‌ ఉపయోగపడుతుంది. క్యాన్సర్‌ కణాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేసే విధంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించేలా నివోలుమాబ్‌ పని చేస్తుంది. ఇలా ఇంజెక్షన్‌ రూపంలో ఔషధాన్ని అందించడం ద్వారా, రోగికి సౌకర్యవంతమైన, సమర్థమైన చికిత్సను అందించే వీలు కలుగుతోంది. నివోలుమాబ్‌ ఇంజెక్షన్‌ షాట్‌ వినియోగానికి యూకే ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు కూడా అందాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.