“గుత్తి వంకాయ” అందరికీ తెలుసు! – ఓసారి ఇలా కొత్తగా “గుత్తి దొండకాయ ఫ్రై” ట్రై చేయండి

 నోరూరించే గుత్తి వంకాయ కర్రీ ఇష్టపడని వారు దాదాపు ఉండరు. వేడివేడి అన్నంతో ఎవ్వరైనా సరే ఈ కూరతో రెండు ముద్దలు అన్నం ఎక్కువే తింటారు. అయితే, గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడూ ఇంట్లో చేస్తూనే ఉంటాం. కాబట్టి, ఓసారి ఇలా గుత్తి దొండకాయ ఫ్రై ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన విధంగా గుత్తి దొండకాయ వేపుడు చేస్తే దొండకాయ ఇష్టం లేని వాళ్లు కూడా ఎంతో ఇష్టపడి తింటారు.


గుత్తి దొండకాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు

  • దొండకాయలు – పావు కేజీ
  • ఉప్పు – రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి – 3
  • పల్లీలు – పావు కప్పు
  • పుట్నాలపప్పు – పావు కప్పు
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • పావు టీస్పూన్​ – పసుపు
  • 2 టేబుల్​స్పూన్లు – శనగపిండి
  • టీస్పూన్​ – ధనియాలపొడి
  • అర టీస్పూన్ – గరం మసాలా
  • టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • ఆయిల్ – సరిపడా
  • కరివేపాకు – 2
  • గుత్తి దొండకాయ ఫ్రై తయారీ విధానం :

    • ముందుగా దొండకాయలు శుభ్రంగా కడగండి. ఆపై గుత్తి వంకాయ కర్రీ కోసం వంకాయలు ఎలా మధ్యలోకి గాట్లు పెట్టుకుంటామో దొండకాయలు అలా కట్ చేసుకోవాలి.
    • అనంతరం స్టవ్​ వెలిగించి కడాయి పెట్టి పావు కప్పు చొప్పున పల్లీలు, పుట్నాలపప్పు వేసి లో ఫ్లేమ్​లో 5 నిమిషాలపాటు వేయించండి. పల్లీలు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోండి.
    • ఇప్పుడు ఒక ప్లేట్లో పావు టీస్పూన్ పసుపు, 2 టేబుల్​స్పూన్లు శనగపిండి, గ్రైండ్​ చేసిన పల్లీలు-పుట్నాలపప్పు పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం, టీస్పూన్​ ధనియాలపొడి, అరటీస్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్​ చేయండి.
    • ఈ మసాలా మిశ్రమాన్ని కట్​ చేసిన దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
    • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి 3 టేబుల్​స్పూన్లు ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆయిల్​ వేడయ్యాక స్టఫ్ చేసుకున్న దొండకాయలు వేసి లో ఫ్లేమ్​లో 5 నిమిషాలపాటు కలుపుతూ వేయించుకోవాలి.
    • దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి.
  • ఇప్పుడు మిగిలిపోయిన కారం మసాలా మిశ్రమం వేసి అంతా కలిసేలా బాగా కలపండి.
  • దొండకాయలు చక్కగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్​లో మూత పెట్టి ఉడికించుకోవాలి.
  • దొండకాయలు బాగా ఉడికిన తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ గుత్తి దొండకాయ ఫ్రై మీ ముందుంటుంది.
  • వేడివేడి అన్నంతో ఈ గుత్తి దొండకాయ ఫ్రై తింటుంటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • ఈ గుత్తి దొండకాయ ఫ్రై నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.