వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది?

వెల్లుల్లి… దీన్ని వాడడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చదివాం. తెలుసుకున్నాం. మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల కీలక పోషకాలు ఇందులో ఉన్నాయి.


సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉపయోగాలు వెల్లుల్లిని వాడడం వల్ల మనకు కలుగుతాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా దానికి చెందిన మరో ఉపయోగమే. ఇక ఇందులో విశేషమేమింటే వెల్లుల్లిని మీరు తినాల్సిన పనిలేదు. అవును, దాన్ని తినకుండానే, దాని వల్ల కలిగే లాభాలను మీరు ఎంచక్కా పొందవచ్చు. అదెలాగంటే…

ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉపయోగాలు కలుగుతాయి. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించడం వల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని పడుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్య ఉండదు.

జలుబు, దగ్గు వంటి శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు. వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.