మరోసారి చెలరేగిన వైభవ్ – 90 బంతుల్లో 190 పరుగులతో విజృంభణ

 IPL 2025లో తన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభవ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.


కేవలం 90 బంతుల్లో 190 పరుగులు నమోదు చేస్తూ సిక్సుల వర్షం కురిపించాడు. ఈ యువ క్రికెటర్ బ్యాటింగ్‌ చాతుర్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Under-19 జట్టులో ఎంపిక:

IPLలో తన ఆటతీరుతో అందరినీ మెప్పించిన వైభవ్‌కు భారత్‌ అండర్-19 జట్టులో చోటు లభించింది. జూన్ 24 నుండి జూలై 23, 2025 వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న ఈ జట్టు ఐదు యూత్ వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సీఎస్కే యువ స్టార్ మరియు జట్టుకెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.

ఇంగ్లాండ్ టూర్ – డబుల్ డోస్ క్రికెట్:

ఇంగ్లాండ్‌లో ఇప్పుడు క్రికెట్ సందడి నెలకొంది. జూన్ 20న సీనియర్ భారత జట్టు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుండగా, అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అంతేకాకుండా, యువ భారత అండర్-19 జట్టూ ఇంగ్లాండ్ పర్యటనపై ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ భారత క్రికెట్ ప్రపంచంలో ప్రశంసలు అందుకుంటోంది.

ఈ ప్రదర్శనతో వైభవ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. వయసు చిన్నదైనా, వైభవ్ ఆడే ఇన్నింగ్స్‌లు మాత్రం సీనియర్ ప్లేయర్లను కూడా తలపిస్తున్నాయి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.