క్రికెట్‌లో విషాదం.. యువ క్రికెటర్ ఆత్మహత్య!

దేశవాలీ క్రికెట్‌లో విషాదం నెలకొంది. పుదుచ్చేరి ప్రాంతీయ క్రికెట్ సెలెక్షన్ ట్రయల్స్‌లో చోటు దక్కకపోవడంతో 19 ఏళ్ల మహిళా క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది.


విషయంలోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన 19 ఏళ్ల ఏంజెల్ గంగ్వానీ ఇంటెన్సివ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. గంగ్వానీ తండ్రి కశ్మీర్ కుమార్ చెన్నైలో జీఎస్టీ సూపరిండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఏంజెల్ గంగ్వానీ పుదుచ్చేరిలోని తిలస్‌పేట్‌లోని ఇంటెన్సివ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవలే తుటిపేట్‌లో జరిగిన పుదుచ్చేరి టీ20 క్రికెట్ జట్టుకు సంబంధించి నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో ఏంజెల్ గంగ్వానీ హాజరైంది. తుది జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన గంగ్వానీ తాను రూమ్‌కు వెళుతున్నట్లు స్నేహితులకు సమాచారం అందించింది.

గురువారం రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగివచ్చిన ఏంజెల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్యహత్మకు పాల్పడింది. అయితే శుక్రవారం ఉదయం గంగ్వానీ కోచ్ ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో అనుమానమొచ్చి గంగ్వానీ నివాసానికి వెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించిన కోచ్.. గంగ్వానీని కతిర్కామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇటీవలే అంతర్జాతీయ క్రికెటర్లు బెన్ స్టోక్స్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి క్రికెటర్లు సొంత డబ్బులతో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. సెలెక్షన్ ట్రయల్స్‌లో ఎంపిక కానంత మాత్రానా ప్రాణాలు తీసుకోవద్దని, ప్రయత్నించాలంటూ సందేశాలు చేరవేస్తున్నప్పటికి ప్రయోజనం ఉండడం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.