ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1 లక్ష దాటిన తులం బంగారం

సిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం దరలు తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.


దీంతో తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,950 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,120 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,950 చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,400కు పెరిగింది. దీంతో తొలిసారి గోల్డ్ రేటు లక్ష రూపాయలకు చేరుకుంది. ఇక ఎపిలోని విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధరపై 1,100 రూపాయలు పెరిగి.. 1,20,000కు చేరుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.