బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?

బ్రెడ్‌ అనగానే బ్రెడ్‌-జామ్, బ్రెడ్‌ ఆమ్లెట్‌ తప్పితే పెద్దగా ఏ వెరైటీ గురించీ ఆలోచించం. ప్రయత్నించం. ఈసారి ఇంట్లో బ్రెడ్‌ ఉంటే వీటిని ప్రయత్నించి చూడండి.


సూపర్‌ అనక మానరు.టిప్‌ ఆఫ్‌ ద డేలో భాగంగా బ్రెడ్‌తో ఇన్ని వైరైటీలు మీకోసం..

బ్రెడ్‌ కీమా
కావలసినవి: బ్రెడ్‌ స్లైసెస్‌ – 4 లేదా 5; సాస్‌ – 2 లేదా 3 టేబుల్‌ స్పూన్లు; కీమా తురుము- పావు కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి); మొజరెల్లా చీజ్‌ తురుము – 4 టేబుల్‌ స్పూన్లు పైనే; ఉల్లిపాయ సన్న ముక్కలు – ఒక టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిరపకాయలు -5 (నిలువుగా ముక్కలు చేసుకోవాలి, పచ్చిమిర్చికి బదులుగా క్యాస్పికమ్‌ ముక్కలు కూడా తీసుకోవచ్చు); నూనె – కొద్దిగా; మిరియాల పొడి – అర టీ స్పూన్‌.

తయారీ: ముందుగా పాన్‌ మీద బ్రెడ్‌ స్లైసెస్‌లను దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్‌కి ఒకవైపు సాస్‌ రాసి, దానిపైన ఉడికిన కీమా కొద్దికొద్దిగా వేసుకోవాలి. అనంతరం కొన్ని ఉల్లి పాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి లేదా క్యాప్సికమ్‌ ముక్కలను బ్రెడ్‌ మీద అక్కడక్కడా పరిచినట్లుగా పెట్టుకుని, వాటిపైన మిరియాల పొడి జల్లుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా చీజ్‌ తురుము వేసుకుని మూత పెట్టి కళాయిలో బేక్‌ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

బ్రెడ్‌-కీమా పిజ్జా

కావలసినవి: బ్రెడ్‌ స్లైసెస్‌ – 7 లేదా 8; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టమాటో – 1 (సన్నగా తరగాలి); క్యాప్సికమ్‌ ముక్కలు – 4 టేబుల్‌ స్పూన్లు; క్యారెట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్‌ చేసుకోవాలి); పసుపు, కారం – అర టీ స్పూన్‌ చొప్పున; గరం మసాలా పొడి-అర టీ స్పూన్‌; పంచదార – అర టీ స్పూన్‌; నూనె -4 టీ స్పూన్లు; ఆవాలు, శనగపప్పు ఒక టీ స్పూన్‌ చొప్పున; జీలకర్ర – అర టీ స్పూన్‌; జీడిపప్పు/పల్లీలు – కొన్ని; కరివే΄ాకు రెబ్బలు -3 లేదా 4; ఉప్పు -సరిపడా; నిమ్మరసం, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా; సన్న కారప్పూస – గార్నిష్‌ కోసం.

తయారీ: ముందుగా, బ్రెడ్‌ ముక్కలను చిన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత, జీడిపప్పు లేదా పల్లీలు వేసి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఆపై కరివేపాకు, ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలను చిన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాప్సికమ్‌ ముక్కలు, క్యారెట్‌ తురుము కూడా వేసి 2 నిమిషాల ΄ాటు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.అనంతరం పసుపు, గరం మసాలా పొడి కారం, పంచదార వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు 4 టేబుల్‌ స్పూన్ల నీరు పోసి, మూత పెట్టి, ఆ మిశ్రమం చిక్కబడే వరకూ ఉండాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కల పాలి. అనంతరం మూత పెట్టి, మంట తగ్గించి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. సర్వ్‌ చేసుకునే ముందు సన్న కారప్పూస వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.

బ్రెడ్‌ బోండా

కావలసినవి: బ్రెడ్‌పౌడర్‌ – 2 కప్పులు; మైదా పిండి – ఒక కప్పు; బంగాళదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి); జీలకర్ర ΄పొడి-అర టీ స్పూన్‌; పులిసిన గడ్డ పెరుగు – పావు కప్పు; వేయించిన కరివేపాకు పొడి – కొద్దిగా (ఆకుల్ని కూడా తీసుకోవచ్చు, చిన్నగా తుంచుకుని వేసుకోవచ్చు); ఉల్లి పాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు -తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా;

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బంగాళదుంప గుజ్జు, మైందాపిండి, జీలకర్ర పొడి, కరివే పాకు పొడి లేదా తురుము, ఉప్పు, ఉల్లిపాయ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆపైన బ్రెడ్‌ పౌడర్‌ వేసుకుని.. కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ బోండా పిండిలా కలుపుకోవాలి. కళాయిలో నూనె కాగిన తర్వాత బోండాలు వేసుకుని.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే సరి΄ోతుంది. అభిరుచిని బట్టి మరిన్ని కూరగాయ ముక్కలను జోడించుకోవచ్చు.

బ్రెడ్‌ ఉప్మా..
కావలసినవి: బ్రెడ్‌ స్లైసెస్‌ – 7 లేదా 8; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టమాటో – 1 (సన్నగా తరగాలి); క్యాప్సికమ్‌ ముక్కలు – 4 టేబుల్‌ స్పూన్లు; క్యారెట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్‌ చేసుకోవాలి); పసుపు, కారం – అర టీ స్పూన్‌ చొప్పున; గరం మసాలా పొడి – అర టీ స్పూన్‌; పంచదార – అర టీ స్పూన్‌; నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు, శనగపప్పు ఒక టీ స్పూన్‌ చొప్పున; జీలకర్ర – అర టీ స్పూన్‌; జీడిపప్పు/పల్లీలు – కొన్ని; కరివేపాకు రెబ్బలు – 3 లేదా 4; ఉప్పు – సరిపడా; నిమ్మరసం, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా; సన్న కారప్పూస – గార్నిష్‌ కోసం.

తయారీ: ముందుగా, బ్రెడ్‌ ముక్కలను చిన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత, జీడిపప్పు లేదా పల్లీలు వేసి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఆపై కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లి పాయ ముక్కలను చిన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాప్సికమ్‌ ముక్కలు, క్యారెట్‌ తురుము కూడా వేసి 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.అనంతరం పసుపు, గరం మసాలా పొడి, కారం, పంచదార వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.

ఇప్పుడు 4 టేబుల్‌ స్పూన్ల నీరు పోసి, మూత పెట్టి, ఆ మిశ్రమం చిక్కబడే వరకూ ఉండాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి, మంట తగ్గించి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి బాగా కల పాలి. సర్వ్‌ చేసుకునే ముందు సన్న కారప్పూస వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది బ్రెడ్‌ ఉప్మా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.