ఈ మొక్కలు డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తాయి..ఈ రోజే మీ ఇంట్లో నాటండి

వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలు చాలా అదృష్టవంతంమైన మొక్కలుగా పరిగణించబడతాయి. వీటిని పెంచుకోవడం వలన అదృష్టాన్ని తీసుకొస్తాయి.. సంపదను ఆకర్షిస్తాయి. ఈ మొక్కలను ఎవరైనా తమ ఇంట్లో వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకుంటే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం లభిస్తుందని.. త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని నమ్మకం. ఈ రోజు సంపదను ఆకర్షించే మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రంలో అనేక మొక్కల గురించి .. వాటిని పెంచుకోవడం వలన కలిగే శుభా అశుభాల గురించి తెలియజేస్తుంది. కొన్ని మొక్కలు పెంచుకోవడం వలన ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సంపదను కూడా ఆకర్షిస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే.. ఖచ్చితంగా ఇంట్లో ఈ మొక్కలను పెంచుకోండి. ఇవి మీకు అదృష్టాన్ని సంపదని తీసుకొస్తాయి.


అదృష్ట మొక్కల జాబితాలో మొదటి పేరు మనీ ప్లాంట్ దే వినిపిస్తుంది. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కని ఇంట్లో ఉంచడం వల్ల సంపద, ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం శుభప్రదం.

జాడే మొక్కను క్రాసులా ఓవాటా అని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీనిని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు. జాడే మొక్క ఇంట్లో సంపదను ఆకర్షిస్తుంది. ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. జాడే మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవడం శుభప్రదం.

వాస్తు శాస్త్రం , ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో వెదురు మొక్కను పెంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనిని సాధారణంగా వెదురు మొక్క అని కూడా పిలుస్తారు. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల అయస్కాంతంలా డబ్బు ఆకర్షిస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి మొక్క మనీ ప్లాంట్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. దీని ఆకులు నెమలి ఈకల వలె అందంగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో నెమలి మొక్కను నాటితే. ఈ మొక్క మీ అదృష్టాన్ని మార్చగలదు. ఇంటి ఈశాన్య దిశలో నెమలి మొక్కను నాటడం శుభప్రదం.

హిందూ మతంలో అపరాజిత మొక్క దీనినే శంఖ పుష్పం మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కని పెంచుకోవడం వలన శనీశ్వరుడి ఆశీస్సులు ఇంటిపై ఉంటాయి. శనిశ్వరుడి అనుగ్రహం ఆ ఇంటి సభ్యులపై ఉంటుంది. సంపద ఆ ఇంటిలో నివసించే కుటుంబ సభ్యులపై కురుస్తుంది. అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం శుభప్రదం.

వాస్తు శాస్త్రం లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం.. కాయిన్ ప్లాంట్ చాలా అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది. ఈ మొక్క సంపద , శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో లేదా కార్యాలయంలో కాయిన్ ప్లాంట్ ను పెంచుకోవడం వలన పెరుగుతున్న అప్పుల నుంచి .. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది.

వాస్తు శాస్త్రంలో శమీ మొక్క దీనినే జమ్మి మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద జమ్మి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో శమీ మొక్క శనీశ్వరుడి ప్రియమైనది. ఇలా మొక్కను పెంచుకోవడం వలన మీ కుటుంబంపై శివుని ఆశీస్సులను కూడా ఉంచుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.