ఈఏపీసెట్‌, ఈసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌పై సందేహాలా? అయితే ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌కి ఫోన్‌ కొట్టండి

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్, ఈసెట్, ఐసెట్‌ కౌన్సెలింగ్‌లకు సంబంధించి ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈఏపీసెట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఈఏపీసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ జులై నెల మొదటి వారంలో లేదంటే..

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్, ఈసెట్, ఐసెట్‌ కౌన్సెలింగ్‌లకు సంబంధించి ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈఏపీసెట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఈఏపీసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ జులై నెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి. బాలకృష్ణా రెడ్డి సూచన ప్రాయంగా చెప్పారుకూడా. ఈ క్రమంలో విద్యార్ధుల సందేహాలను తీర్చేందుకు ఉన్నత విద్యామండలి తొలిసారిగా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.


హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకులో ఈఏపీసెట్‌ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు, నిపుణులు అందుబాటులో ఉండనున్నారు. వీరు విద్యార్ధుల నుంచి వచ్చే సందేహాలకు సమాధానాలిస్తారని విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. అందుకు విద్యార్థులు 7660009768, 7660009769 ఫోన్‌ నంబర్లకు ఫోన్‌చేసి అనుమానాలను నివృతి చేసుకోవాలని తెలిపారు. అలాగే tgcets.telangana@gmail.comకు ద్వారా కూడా సందేహాలను పంపితే సమాధానాలిస్తామని వివరించారు. త్వరలో విద్యాపరమైన సందేహాలను తీర్చేందుకు సబ్జెక్టు నిపుణులను సైతం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

తెలంగాణ పీఈసెట్‌ 2025 ఫలితాల్లో 94.96శాతం ఉత్తీర్ణత

తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యాయామ విద్య కోర్సులైన బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల పాలమూరు యూనివర్సిటీ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. పీఈసెట్‌ 2025 ఫలితాల్లో 94.96 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టీజీ పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.ఎస్‌. దిలీప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.