మీ ఇంట్లో ఈ నాలుగు మెడిసిన్ మొక్కలు పెంచండి..మీ పిల్లలను తరచూ హాస్పిటల్‌కి తీసుకెళ్లే అవసరం ఉండదు

ఇంట్లో ఈ ఔషద మొక్కలుంటే పిల్లలు సేఫ్


ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు

జ్వరం, జలుబు తగ్గించడంలో పుదీనా, తులసి కీలక పాత్ర

చిన్న చిన్న గాయాలకు కలబంద బెటర్

పుదీనా

ప్రతిరోజు పుదీనాను పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి చిన్నదానికీ జ్వరం, జలుబు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగా లేకపోతేనే జ్వరం, జలుబు, కొన్ని వైరస్‌లు వెంట వెంటనే వస్తుంటాయి. అందుకే ప్రతి రోజు పుదీనా ఏదైనా ఆహారంలోగానీ లేదంటే పుదీనా రసం లేదా పుదీనా నీళ్లను పిల్లలకు ఇవ్వాలి.

కలబంద

పిల్లలకు చిన్న గాయం కలిగినా కలబంద బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సంరక్షణకు, చిన్ని చిన్న గాయాలు మాపడానికి, చర్మాన్ని తేమగా ఉంచడానికి, దురద, ఎర్రటి మచ్చలను తగ్గించడానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది. అయితే పిల్లలకు నోటి ద్వారా కలబందను ఇవ్వకూడదు. అంటే కలబందతో తయారు చేసిన ఎటువంటి రసాన్ని ఇవ్వకూడదు.

తులసి

పిల్లలకు రోగనిరోధక శక్తి పెంచడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో తులసి ఎక్కువగా సహాయపడుతుంది. ఇంకా తులసిలో ఉండే బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు హానికరమైన క్రిములను పొరాడతాయి. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తికూడా తులసిలో ఉంది.

లెమన్ గ్రాస్

లెమన్ గ్రాస్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఇది సహాయపడుతుంది. అయితే లెమన్ గ్రాస్‌ని పిల్లలకు వాడే ముందు మీ పిల్లల శరీరతత్వాన్ని గుర్తించాలి. లేదంటే మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాతో ఇవ్వడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.