11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాగర నగరం విశాఖపట్నం వేదికగా మారింది. విశాఖ యోగా డేకు భారీ స్పందన లభించింది. యోగా డేలో పాల్గొనేందుకు వేలాదిగా ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడం రాష్ట్రనికే గర్వకారణమని, ప్రపంచ దేశాలు విశాఖ వైపు చూస్తున్నాయని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
గిన్నిస్ బుక్ రికార్డులు లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. విశాఖలో ఒకేసారి ఐదు లక్షల మందితో యోగాసనాలతో రికార్డు క్రియేట్ చేశారు. యోగాంధ్రలో 22 వరల్డ్ బుక్ రికార్డ్ ల కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేసింది.
విశాఖ ప్రధాన వేదిక వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం.
యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంచుతుందని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
































