తల్లికి వందనంపై కీలక అప్డేట్..! వారికి ఇదే లాస్ట్ ఛాన్స్

ఏపీ ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత తల్లికి వందనం పథకం అమలును ప్రారంభించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ 13 వేల చొప్పన జమ చేస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మంది తమకు తల్లికి వందనం డబ్బులు తమ ఖాతాల్లో పడ లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది.


తల్లికి వందనం పథకంలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుుక ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది. దీని ప్రకారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఇచ్చిన గడువు రేపటితో ముగియబోతోంది. ఆ లోపు అందిన ఫిర్యాదుల్ని పరిశీలించి అర్హులకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఇంకా తల్లికి వందనం పథకం డబ్బులు రాకపోతే మాత్రం స్థానిక సచివాలయాల్ని సంప్రదించాలని కోరుతోంది.

ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తల్లికి వందనం పథకం డబ్పులు రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అలాగే 21 నుంచి 28 వరకూ ఆయా అర్జీలను పరిశీలిస్తారు. జూన్ 30న ఒకటో తరగతితో పాటు ఇంటర్ అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం వీరికి జూలై 5న డబ్బులు జమ చేస్తారు. దీంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్ట్ లో పేరున్నా డబ్బులు జమ కాలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.